News December 19, 2024

ప్రకాశం: నల్లమలో తప్పిపోయిన భక్తులను రక్షించిన పోలీసులు

image

యర్రగొండపాలెం మండలం నల్లమల అటవీప్రాంతంలోని ఇష్టకామేశ్వరీ దేవి ఆలయానికి వెళుతూ తప్పిపోయిన 15 మంది భక్తులను పోలీసులు రక్షించారు. బుధవారం శ్రీశైల మల్లన్న స్వామిని దర్శించుకొని అక్కడ నుంచి ఇష్ట కామేశ్వరీదేవి ఆలయానికి కాలి నడకన వెళుతూ అటవీప్రాంతంలో తప్పిపోయి 100కు కాల్ చేయగా యర్రగొండపాలెం పోలీసులు వారికోసం నల్లమల అడవిలో గాలించి వారిని రక్షించారు. వీరంతా రేపల్లె మండలం మంత్రిపాలెం వాసులుగా గుర్తించారు.

Similar News

News November 22, 2025

ప్రకాశం: భార్య.. భర్త.. ఓ ప్రియురాలు

image

వివాహితుడు ఆత్మహత్యకు యత్నించిన ఘటన నెల్లూరులో జరిగింది. కలిగిరి(M) ఏపినాపికి చెందిన విష్ణువర్ధన్‌కు సరితతో 8 ఏళ్ల క్రితం పెళ్లైంది. కాగా ఇటుకబట్టీల వద్ద పనిచేసే క్రమంలో ధనలక్ష్మితో పరిచయమై వివాహేతర సంబంధం ఏర్పడింది. ఈక్రమంలో వీరు పామూరులోని లాడ్జిలో ఉన్నారని తెలియడంతో సరిత తన భర్తను కలిగిరికి తీసుకొచ్చింది. ప్రియురాలిని దూరం చేశారంటూ విష్ణువర్ధన్ ఆత్మహత్యకు యత్నించగా భార్య ఆసుపత్రిలో చేర్చింది.

News November 22, 2025

రేపు ఒంగోలులో జాతీయస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలు

image

ఒంగోలులోని డాక్టర్ BR అంబేడ్కర్ భవనంలో ఆదివారం 12వ జాతీయ స్థాయి కరాటే, కుంగ్ ఫు ఓపెన్ ఛాంపియన్‌షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు బ్లాక్ బెల్ట్ 7వ డాన్ కరాటే మాస్టర్ వెంకటేశ్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శనివారం మాట్లాడుతూ.. జాతీయస్థాయి కరాటే ఛాంపియన్‌షిప్ పోటీలకు 13 రాష్ట్రాల నుంచి మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులు రానున్నట్లు తెలిపారు. క్రీడల ప్రాముఖ్యతను తెలిపేందుకు పోటీలు దోహదపడతాయన్నారు.

News November 22, 2025

ప్రకాశం: సబ్సిడీపై సెప్టిక్ ట్యాంక్ వాహనాలు..!

image

ప్రకాశం జిల్లా నిరుద్యోగ యువతకు సెప్టిక్ ట్యాంక్ క్లీనింగ్ వాహనాలను సబ్సిడీపై మంజూరుచేసేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు SC కార్పొరేషన్ ED అర్జున్ నాయక్ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో శుక్రవారం మాట్లాడిన ఆయన జిల్లాకు 3వేల లీటర్ల సామర్థ్యం గల వాహనాలు మంజూరయ్యాయన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు ఒంగోలు నార్త్ బైపాస్ రోడ్డులోని ప్రగతి భవన్‌ను సంప్రదించాలన్నారు.