News June 20, 2024

ప్రకాశం: నామినేటెడ్ పదవుల కోసం పోటాపోటీ

image

TDP అధికారంలోకి వచ్చిన నేపథ్యంలో నామినేటెడ్‌ పదవులపై ఆ పార్టీ నాయకుల ఆశలు పెరుగుతున్నాయి. వీటితోపాటు రేషన్‌ డీలర్‌షిప్‌, ఫీల్డ్‌ అసిస్టెంట్‌ తదితర పోస్టుల కోసం గ్రామ, మండల స్థాయి నాయకులు తీవ్రంగా పోటీపడుతున్నారు. ఓ నియోజకవర్గ స్థాయిలో 150 నుంచి 170 వరకు, మండల స్థాయిలో 40-60 వరకు వివిధ రకాల పోస్టులు ఉన్నట్లు TDP శ్రేణులు క్షేత్రస్థాయిలో లెక్కలేసుకుని తమకు ఏ పదవులు కావాలో నిర్ణయించుకుంటున్నారు.

Similar News

News December 3, 2025

ప్రకాశం జిల్లాలో వర్షపాతం నమోదు వివరాలివే.!

image

ప్రకాశం జిల్లాలో నమోదైన వర్షపాతం వివరాలను ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ తాజాగా ప్రకటించింది. మంగళవారం ఉదయం నుంచి బుధవారం ఉదయం 8.30 గంటల వరకు సగటు వర్షపాతం 0.3 మిల్లీ మీటర్ల వర్షపాతం నమోదైందని తెలిపింది. మంగళవారం రాత్రి ఒంగోలుతోపాటు పలు మండలాలలో మోస్తరు వర్షపు జాడ కనిపించింది. దిత్వా తుఫాను ప్రభావం జిల్లాపై అంతంత మాత్రమేనని చెప్పవచ్చు.

News December 3, 2025

సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన ప్రకాశం కలెక్టర్.!

image

ప్రకాశం కలెక్టర్ రాజాబాబు మరో సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయం నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించిన కలెక్టర్ రాజాబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. జిల్లాలోని సాంఘిక సంక్షేమ వసతి గృహాలను ఒక్కొక్క అధికారి, ఒక్కొక్క వసతి గృహాన్ని దత్తత తీసుకోవాలని కలెక్టర్ నిర్ణయించారు. దీంతో ఆయా వసతి గృహాల్లో ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కార దిశగా చర్యలు తీసుకునే అవకాశం ఉందన్నారు.

News December 3, 2025

ప్రకాశం: ఆకలితో అలమటించిన విద్యార్థులు.. వార్డెన్ సస్పెండ్.!

image

విధుల పట్ల అలసత్వం వహించిన కొనకనమిట్ల సాంఘిక సంక్షేమ వసతి గృహ వార్డెన్‌ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ రాజాబాబు మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. వసతి గృహంలోని విద్యార్థులకు ఉదయం అల్పాహారం, మధ్యాహ్నం భోజనం అందించకపోవడంతో విద్యార్థులు పడిన ఇబ్బందులపై కలెక్టర్ విచారణకు ఆదేశించారు. విచారణ నివేదిక మేరకు వార్డెన్‌ను సస్పెండ్ చేస్తున్నట్లు కలెక్టర్ ప్రకటించారు.