News December 4, 2024
ప్రకాశం: నాలుగేళ్ల క్రితం భర్త.. ఇప్పుడు కుమారుడు మృతి
నాలుగేళ్ల క్రితం భర్త అకాల మరణంతో కుటుంబ పోషిన్తున్న తల్లి లక్ష్మీకి విధి కడుపు కోత మిగిల్చింది. గారభంగా పెంచుకున్న కుమారుడిని సోమవారం పాముకాటు వేయడంతో మరణించాడు. ఈ ఘటన గిద్దలూరు మండలంలోని బురుజుపల్లె గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. నిద్రిస్తున్న మనోజ్ తలపై పాము కాటు వేసింది. బాలుడు అరవడంతో తల్లి పామును దూరంగా విసిరేసింది. ఆసుపత్రికి తరలించగా పరిస్థితి విషమించడంతో మరణించాడు.
Similar News
News January 17, 2025
బాల్య వివాహలు లేని జిల్లాగా తీర్చిదిద్దుదాం: ప్రకాశం కలెక్టర్
ప్రకాశం జిల్లాను బాల్య వివాహాలు, బాల కార్మికులు లేని జిల్లాగా తీర్చిదిద్దడంలో అధికారులు సమన్వయంతో పని చేయాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. గురువారం కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో అన్ని శాఖల ఉద్యోగుల్లో ఒకరికి శిక్షణ ఇచ్చి జిల్లాను ఆదర్శ జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.
News January 16, 2025
పాకల ఘటన దురదృష్టకరం: S.P ఏ.ఆర్ దామోదర్
పాకల బీచ్‌లో నలుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న జిల్లా S.P ఏ.ఆర్ దామోదర్, స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి ఘటనా స్థలాన్ని సందర్శించారు. బీచ్‌లో నలుగురు ప్రాణాలు కోల్పోవడం దురదృష్టకరమన్నారు. మృతుడు మాధవ సతీమణి నవ్య (21)ను సురక్షితంగా కాపాడగలిగామని S.P తెలియజేశారు. ఆయన వెంట పోలీసు సిబ్బంది ఉన్నారు.
News January 16, 2025
ఏపీఐఐసీ ఎండీ టెలి కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న ప్రకాశం జిల్లా కలెక్టర్
ఇండస్ట్రియల్ నోడ్స్ అభివృద్ధికి సంబంధిత జిల్లాల కలెక్టర్లు ప్రత్యేక దృష్టి సారించాలని ఏపీఐఐసీ ఎండీ అభిషిక్త్ కిషోర్, జిల్లా కలెక్టర్లకు సూచించారు. గురువారం మంగళగిరి నుంచి ఆయనడి జిల్లా కలెక్టర్లతో వర్చువల్‌గా సమావేశమై ఇండస్ట్రియల్ నోడ్స్ అభివృద్ధికి సంబంధించిన భూ సేకరణ ప్రక్రియ పై జిల్లాల వారీగా సమీక్షించారు. కలెక్టర్ తమీమ్ అన్సారియా, జాయింట్ కలెక్టర్ గోపాల క్రిష్ణ పాల్గొన్నారు.