News April 11, 2025
ప్రకాశం: నిప్పులు కురిపించిన భానుడు

కనిగిరి నియోజకవర్గంలోని నందన మారెళ్ళలో గురువారం రాష్ట్రంలోనే అత్యధికంగా 41.8° ఉష్ణోగ్రత నమోదయినట్టు రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. వృద్ధులు, చిన్నారులు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ఉదయం 11 నుంచి సాయంత్రం నాలుగులోపు అత్యవసరం అయితే తప్ప బయట తిరగవద్దు అని పేర్కొన్నారు.
Similar News
News April 20, 2025
బేస్తవారిపేట: పిడుగుపాటుకు ఇద్దరు యువకులు మృతి

బేస్తవారిపేట మండలం పెద్ద ఓబినేనిపల్లిలో విషాదం నెలకొంది. ఆదివారం క్రికెట్ ఆడుతుండగా పిడుగు పడటంతో ఇద్దరు యువకులు అక్కడికక్కడే మృతిచెందగా.. మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. క్షతగాత్రుడిని కంభం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతులు పెద్ద ఓబులేనిపల్లికి చెందిన ఆకాశ్, సన్నీగా గ్రామస్థులు గుర్తించారు. సమాచారం అందుకున్న అధికారులు ఘటనా స్థలానికి చేరుకున్నారు.
News April 20, 2025
ప్రకాశం: భార్యను హతమార్చిన భర్త

ఉమ్మడి ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. భార్య నీలం మంగమ్మ (45)ను భర్త నీలం శ్రీనివాసరావు హతమార్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News April 20, 2025
ప్రకాశం: పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది

పెళ్లిళ్ల సీజన్ వచ్చేసింది. ఏప్రిల్, మే, జూన్ మాసాలలో 24 రోజులు పెళ్లిళ్లకు మంచి గడియలు ఉన్నాయి. మండు వేసవి అయినప్పటికీ మంచిగడియల్లో పెళ్లిళ్లు చేయాలని పెద్దలు నిర్ణయించడంతో ప్రకాశం జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. ఈ సీజన్లో కేవలం వివాహాల మీదనే రూ.30 కోట్ల వ్యాపారాలు జరుగుతున్నట్లుగా అంచనా వేస్తున్నారు. ఇక కళ్యాణ మండపాలు, గోల్డ్, బట్టల షాపులు సందడిగా మారాయి.