News March 24, 2025

ప్రకాశం: నేటి నుంచి ఇన్విజిలేటర్ల మార్పు

image

ప్రకాశం జిల్లాలోని 10వ తరగతి పరీక్షా కేంద్రాల్లో ఇన్విజిలేటర్లను మారుస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. జిల్లాలోని 146 పరీక్ష కేంద్రాల్లో గణితం పరీక్ష నుంచి 1,300 మందిని జంబ్లింగ్ రూపంలో మార్చారు. గణితం పీఎస్, ఎన్ఎస్, సోషల్ స్టడీస్ పరీక్షలకు ఇన్విజిలేటర్లను జంబ్లింగ్ పద్ధతిలో మార్చామని, వారు ఆయా కేంద్రాలలో విధులు నిర్వహించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.

Similar News

News October 21, 2025

ప్రకాశం జిల్లా ‘పోలీస్ సింగం’ ఈయనే.!

image

నేడు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. ఈ నేపథ్యంలో పలువురు పోలీసు అమరవీరులను స్మరించుకోవాల్సిందే. ప్రకాశం జిల్లాకు చెందిన ఎందరో పోలీస్ అధికారులు, సిబ్బంది విధులు నిర్వహిస్తూ అమరులయ్యారు. వారిలో ఒంగోలుకు చెందిన జాన్ వెస్లీ IPS ఒకరు. ఈయన YS రాజశేఖర్‌రెడ్డి భద్రతా అధికారిగా విధులు నిర్వహించారు. 2009లో జరిగిన హెలికాప్టర్ ప్రమాదంలో YSRతో సహా జాన్‌వెస్లీ విధినిర్వహణలోనే ప్రాణాలు విడిచారు.

News October 21, 2025

నేడు ఒంగోలులో అమరవీరుల దినోత్సవం.!

image

ఒంగోలులోని పోలీసు పరేడ్ గ్రౌండ్ వద్ద స్మృతి వనంలోని పోలీసు అమరవీరుల స్మారక స్థూపం వద్ద మంగళవారం ఉదయం 7.30 గంటలకు పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం నిర్వహించనున్నట్లు SP హర్షవర్ధన్ రాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో పోలీస్ అమరవీరులకు జిల్లా అధికారులు, ప్రజాప్రతినిధులు నివాళులు అర్పించనున్నారని చెప్పారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. జిల్లాలో పోలీస్ అమరవీరుల త్యాగాలు అజరామరం అని పేర్కొన్నారు.

News October 20, 2025

నేడు ప్రకాశం జిల్లా SP కార్యక్రమం రద్దు

image

దీపావళి పండుగ సందర్భంగా సోమవారం (ప్రభుత్వ సెలవు దినం) కావడంతో “ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (మీకోసం) తాత్కాలికంగా రద్దు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించాలని, ఫిర్యాదులు చేసేందుకు వ్యయ ప్రయాసలుపడి జిల్లా పోలీసు కార్యాలయంకు సోమవారం రావద్దని ఎస్పీ సూచించారు.