News March 29, 2024

ప్రకాశం: నేటి నుంచి జూనియర్ కళాశాలలకు సెలవులు

image

జిల్లాలోని అన్ని యాజమాన్యాల ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జూనియర్ కళాశాలలకు ఇంటర్ విద్యామండలి కార్యదర్శి ఆదేశాల మేరకు శుక్రవారం నుంచి వేసవి నెలవులు ప్రకటిస్తున్నట్లు ఆర్ఐవో సైమన్ విక్టర్ తెలిపారు. జూన్ 1న కళాశాలలు పునః ప్రారంభమవుతాయన్నారు. ప్రభుత్వ ప్రైవేటు కళాశాలన్నింటికి ఈ ప్రకటన వర్తిస్తుందన్నారు. వేసవి సెలవుల్లో కళాశాలల్లో తరగతులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Similar News

News March 17, 2026

2 నెలల పాపకు పేరు పెట్టిన ప్రకాశం JC

image

కురిచేడు మండలానికి చెందిన చెంచు కుటుంబాలు 29 మంది నాగర్ కర్నూలు (D) బొగ్గుల బట్టిలో పదేళ్లుగా బానిస కార్మికులుగా పనిచేస్తున్నారు. ఈ విషయం స్వచ్ఛంద సంస్థలు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లారు. <<19399497>>స్పందించిన అధికారులు<<>> సోమవారం వీరిని కలెక్టర్ రాజాబాబు దగ్గర హాజరుపరిచారు. కలెక్టర్ వీరికి పునరావాస చర్యలు ఏర్పాటుచేయాలని ఆదేశించారు. కార్మికుల్లో ఓ దంపతుల 2 నెలల పాపకు JC ” ప్రేరణ” అని నామకరణం చేశారు.

News March 17, 2026

దోర్నాల: పులులు సంచరించే ప్రదేశం.. జాగ్రత్త

image

శ్రీశైలంలో ఉగాది మహోత్సవాల సందర్భంగా దోర్నాల–శ్రీశైలం రహదారిలో ఈ నెల 20వ వరకు రాత్రి వేళల్లోనూ వాహన రాకపోకలకు అటవీశాఖ అధికారులు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మార్గం పులుల అభయారణ్యం గుండా వెళ్లడంతో, రాత్రి సమయంలో పులులు సహా, అడవి జంతువులు రోడ్డు దాటే అవకాశం ఎక్కువగా ఉన్నందున వాహనదారులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. వేగం తగ్గించి జాగ్రత్తగా ప్రయాణించాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.