News May 21, 2024

ప్రకాశం: నేటి నుంచి డిగ్రీ మూల్యాంకనం ప్రారంభం

image

ఆచార్య నాగార్జున యూనివర్సిటీ డిగ్రీ 4, 5వ సెమిస్టర్ల పరీక్ష పత్రాల మూల్యాంకనం ఒంగోలులోని డీఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం నుంచి నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ డి. కళ్యాణి తెలిపారు. ఉదయం 10 గంటలకు మూల్యాంకనం ప్రారంభమవుతుందని, ఉమ్మడి ప్రకాశం జిల్లా పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల అధ్యాపకులు యూనివర్సిటీ అపాయింట్మెంట్ ఐడీ కార్డ్, కాలేజీ రిలీవింగ్ ఆర్డర్ తీసుకురావాలని కోరారు.

Similar News

News November 27, 2025

పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి: DEO

image

DEO కిరణ్ కుమార్ బుధవారం కొండేపి మండలంలోని ముప్పవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్కూల్ రికార్డులు క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులకు పలు సూచనలు చేశారు. పదో తరగతి విద్యార్థులపై ప్రణాళికతో స్టడీ అవర్స్ నిర్వహించాన్నారు. విద్యార్థుల ఉత్తీర్ణతను పెంచే విధంగా కృషి చేయాలని సూచించారు.

News November 27, 2025

ప్రకాశం: నకిలీ బంగారంతో కేటుగాళ్ల బురిడీ

image

త్రిపురాంతకంలోని ఓ జ్యువెలర్స్ షాప్‌లో ఇద్దరు కేటుగాళ్లు నకిలీ బంగారం పెట్టి యజమానిని బురిడీ కొట్టించారు. 28 గ్రాముల నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి రూ.1.50లక్షలను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. తాను మోసపోయినట్లు గ్రహించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యటు చేపట్టారు.

News November 26, 2025

29న ఒంగోలులో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు

image

ఒంగోలులోని డీఆర్ఆర్ఎం హై స్కూల్లో ఈనెల 29న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులను క్రీడా పోటీలలో సైతం ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.