News April 12, 2024
ప్రకాశం: నేడు తేలనున్న ఇంటర్ విద్యార్థుల భవితవ్యం

ఇంటర్మీడియట్ పరీక్ష ఫలితాలు శుక్రవారం ఉదయం 11 గంటలకు విడుదల కానున్నాయని ఆర్ ఐవో సైమన్ విక్టర్ చెప్పారు. జిల్లాలో ఈ ఏడాది ఇంటర్మీడియట్ పరీక్షలను 39,377మంది రాశారు. వీరిలో 19,233 మంది మొదటి సంవత్సరం, 18,128 మంది రెండో సంవత్సరం పరీక్షలకు హాజరయ్యారు. వీరి భవితవ్యం కొన్ని నిమిషాలలో తేలనుంది. ఇప్పటికే విద్యార్థులు ఫలితాల కోసం నెట్ సెంటర్ల వద్దకు చేరారు.
Similar News
News March 20, 2025
ప్రకాశం: చెరువులో పడి ఇద్దరు చిన్నారులు మృతి.!

ప్రకాశం జిల్లాలో గురువారం విషాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కురిచేడు మండలం పడమరపల్లెకు చెందిన ఇద్దరు చిన్నారులు ప్రమాదవశాత్తు చెరువులో పడి మృతి చెందారు. దీంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. అయితే చిన్నారుల మృతికి గల కారణాలు, చిన్నారుల పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

ప్రకాశం: 22న జిల్లా స్థాయి హాకీ జట్ల ఎంపికలు.!

ప్రకాశం జిల్లా హాకీ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 22న సంతనూతలపాడు మండలంలోని మైనంపాడులో గేమ్స్ జరగనున్నాయి. ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో జిల్లా జూనియర్ బాల,బాలికల హాకీ జట్ల ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ అధ్యక్షు, కార్యదర్శులు ఏవి.రమణారెడ్డి, ఏ. సుందరరామిరెడ్డి తెలిపారు. హాకీపట్ల ఆసక్తి గల క్రీడాకారులు ధ్రువీకరణ పత్రాలతో రావాలని పేర్కొన్నారు.