News January 20, 2025

ప్రకాశం: పబ్లిక్ గ్రీవెన్స్ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు

image

ప్రజా ఫిర్యాదులను పరిష్కారించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్, పోలీస్ అధికారులు ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి 81 ఫిర్యాదులు వచ్చాయని అన్నారు. అనంతరం ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను తెలుసుకున్నారు. సంబంధిత అధికారులతో మాట్లాడి వెంటనే చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు త్వరితగతిన న్యాయం అందించేలా చూడాలని ఆదేశించారు.

Similar News

News November 27, 2025

ప్రకాశం: విద్యార్థుల పట్ల టీచర్ అసభ్య ప్రవర్తన.. చివరికి సస్పెండ్!

image

ప్రకాశం జిల్లా నాగులుప్పలపాడు మండలం నిడమనూరు ప్రభుత్వ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్‌గా విధులు నిర్వహిస్తున్న వినయ్‌ను సస్పెండ్ చేసినట్లు DEO కిరణ్ కుమార్ తెలిపారు. ఈ మేరకు గురువారం సాయంత్రం ప్రకటన విడుదల చేశారు. బాలికల పట్ల <<18401027>>అసభ్యంగా ప్రవర్తిస్తున్నట్లు<<>> వచ్చిన అభియోగంపై <<18404073>>విచారణ<<>> జరిపామన్నారు. విచారణలో తేలిన అంశాల ఆధారంగా కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఆయన చెప్పారు.

News November 27, 2025

ప్రకాశం: ఫ్రీ ట్రైనింగ్‌తో జాబ్.. డోంట్ మిస్.!

image

ఒంగోలులోని ప్రభుత్వ ఐటీఐ బాలికల కళాశాలలో ఎలక్ట్రిక్ వెహికల్ సర్వీస్ టెక్నీషియన్, ఫోర్ వీలర్ సర్వీస్ టెక్నీషియన్ కోర్సులను ఉచితంగా అందిస్తున్నట్లు స్కిల్ డెవలప్మెంట్ అధికారి రవితేజ తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో గురువారం మాట్లాడుతూ.. స్కిల్ డెవలప్మెంట్ ఆధ్వర్యంలో 3 నెలలు ఉచిత శిక్షణ అందిస్తామని, ఆ తర్వాత ఉపాధి అవకాశాలను కల్పిస్తామన్నారు. ఆసక్తిగలవారు ఈనెల 28లోగా కళాశాలను సంప్రదించాలన్నారు.

News November 27, 2025

ఉపాధ్యాయుడిపై విచారణకు త్రి మెన్ కమిటీ నియామకం

image

నాగులుప్పలపాడు మండలం బి నిడమనూరు కళాశాలకు చెందిన తెలుగు ఉపాధ్యాయుడు వినయ్‌పై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో త్రి మెన్ విచారణ కమిటీని నియమించినట్లు డీఈఓ కిరణ్ కుమార్ తెలిపారు. విద్యార్థినుల పట్ల ఉపాధ్యాయుడు అసభ్యంగా ప్రవర్తించాడన్న కారణంగా గ్రామస్థులు దేహశుద్ధి చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై డిప్యూటీ డీఈఓ ఆధ్వర్యంలో విచారణ నిర్వహించి, తగిన చర్యలు తీసుకుంటామన్నారు.