News March 26, 2025

ప్రకాశం: పాఠశాలల్లో వాటర్ బెల్..!

image

ప్రకాశం జిల్లాలోని అన్ని పాఠశాలల్లో వాటర్ బెల్ కార్యక్రమం నిర్వహిస్తామని డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. వేసవి ఎండల దృష్ట్యా విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమం ప్రారంభించిందన్నారు. ఒంటిపూట బడుల నేపథ్యంలో ఉదయం 10, 11, 12 గంటల సమయాల్లో రోజుకు మూడు సార్లు వాటర్ బెల్ నిర్వహించాలని టీచర్లకు ఆదేశాలు జారీ చేశారు.

Similar News

News April 2, 2025

ప్రకాశం: రేపటి నుంచి పది మూల్యాంకనం ప్రారంభం

image

ఒంగోలులోని డీఆర్‌ఆర్‌ మున్సిపల్‌ హైస్కూలులో పదో తరగతి మూల్యాంకనం ఈ నెల 3 నుంచి 9వరకు నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యా శాఖాధికారి ఎ.కిరణ్‌కుమార్‌ తెలిపారు. పరీక్షల మూల్యాంకనానికి 150 గ్రూపులు ఏర్పాటు చేశామన్నారు. ఇందులో 150 మంది చీఫ్‌ ఎగ్జామినర్స్‌, 600 మంది అసిస్టెంట్‌ ఎగ్జామినర్స్‌, 300 మంది స్పెషల్‌ అసిస్టెంట్స్‌ను తీసుకున్నామన్నారు. జిల్లాకు మొత్తం 1,90,000 పేపర్లు కేటాయించినట్లు తెలిపారు.

News April 2, 2025

పర్చూరులో విషాదం.. యువకుడు మృతి

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా పర్చూరు నెహ్రూనగర్ లో మంగళవారం విషాదం చోటుచేసుకుంది. చుక్కా వంశీ అనే యువకుడు ఆరు మంది స్నేహితులతో కలిసి సముద్ర స్నానానికి వాడరేవు వెళ్లాడు. వంశీ స్నానం చేస్తుండగా సముద్రంలో మునిగి చనిపోయాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చీరాల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. వంశీ తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

News April 2, 2025

ఒంగోలులో ఇలా చేస్తున్నారా..?

image

ప్రకాశం ఎస్పీ దామోదర్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగే వారిపై పోలీసులు నిఘా పెట్టారు. మంగళవారం రాత్రి ఏకకాలంలో దాడులు చేశారు. ఒంగోలు తాలుకా PS పోలీస్ స్టేషన్ పరిధిలో ఆకస్మిక తనిఖీలు చేయగా.. బహిరంగంగా మద్యం తాగుతూ ముగ్గురు పట్టుబడ్డారు. ఇలాగే బహిరంగంగా మద్యం తాగితే చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు.

error: Content is protected !!