News November 19, 2024
ప్రకాశం: పాఠశాలల పని వేళల్లో మార్పు

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 38 ఉన్నత పాఠశాలల్లో పనివేళలు మారుస్తూ DEO ఎ.కిరణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఓ ఉన్నత పాఠశాల చొప్పున 38 పాఠశాలలను సెలెక్ట్ చేశారు. ఆయా పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు పని వేళలు పొడిగించారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పాఠశాలల టైమింగ్ మారిన విషయం తెలిసిందే.
Similar News
News November 11, 2025
ప్రకాశం: ఉండవల్లికి బయలుదేరిన సీఎం

ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో MSME ప్రాజెక్టుల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు వచ్చారు. అనంతరం సభా ప్రాంగణంలో ఆయన పలు విషయాలను ప్రజలతో పంచుకున్నారు. వెలుగొండ ప్రాజెక్టుకు నీరు తెచ్చి కనిగిరిని కనకపట్నంగా తీర్చుదిద్దుతానని ఆయన చెప్పుకొచ్చారు. అలాగే రాష్ట్రంలోని అన్ని జిల్లాలో MSME ప్రాజెక్టులకు వర్చువల్‌గా శంకుస్థాపనలు చేశారు. అనంతరం అక్కడి నుంచి హెలికాఫ్టర్‌లో ఉండవల్లికి బయలుదేరారు.
News November 11, 2025
త్వరలో కనిగిరి కనకపట్నం అవుతుంది: సీఎం చంద్రబాబు

1996లో తాను ప్రారంభించిన వెలుగొండ ప్రాజెక్టును 2026 నాటికి పూర్తి చేసి కనిగిరి ప్రజలకు నీరు అందిస్తానని సీఎం చంద్రబాబు హామీ ఇచ్చారు. ఇవాళ పెద్ద చెర్లోపల్లి మండలంలో MSME పార్కు ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడారు. శ్రీశైలం నుంచి కాకుండా గోదావరి నీళ్లు కూడా జిల్లాకు తీసుకొస్తానని అన్నారు. ఇది జరిగితే కనిగిరి కనకపట్నం అవుతుందని పేర్కొన్నారు. అలాగే పామూరుకు రైల్వే స్టేషన్ వస్తుందని చెప్పుకొచ్చారు.
News November 11, 2025
ప్రకాశం: పెద్ద చెర్లోపల్లికి చేరుకున్న సీఎం

ఇవాళ ప్రకాశం జిల్లా పర్యటనలో భాగంగా సీఎం చంద్రబాబు పెద్ద చెర్లోపల్లి మండలం ఇర్లపాడు వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ వద్దకు చేరుకున్నారు. ఆయనకు జిల్లా ఎమ్మెల్యేలు, ఎంపీ, టీడీపీ ఇన్‌ఛార్జులు, కలెక్టర్, ఎస్పీ స్వాగతం పలికారు. అక్కడి నుంచి రోడ్డు మార్గాన సభాస్థలికి చేరకున్నారు.


