News November 19, 2024

ప్రకాశం: పాఠశాలల పని వేళల్లో మార్పు

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా 38 ఉన్నత పాఠశాలల్లో పనివేళలు మారుస్తూ DEO ఎ.కిరణ్ కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. జిల్లాలో పైలట్ ప్రాజెక్ట్ కింద మండలానికి ఓ ఉన్నత పాఠశాల చొప్పున 38 పాఠశాలలను సెలెక్ట్ చేశారు. ఆయా పాఠశాలల్లో ఉదయం 9 గంటల నుంచి 5 గంటల వరకు పని వేళలు పొడిగించారు. నెల్లూరు జిల్లాలో ఇప్పటికే పాఠశాలల టైమింగ్ మారిన విషయం తెలిసిందే.

Similar News

News December 11, 2024

జవాన్ మృతిపై స్పందించిన మంత్రి అనిత

image

జమ్మూలో ల్యాండ్ మైన్ పేలి వీరమరణం పొందిన కంభం మండలం <<14838717>>రావిపాడుకు చెందిన జవాన్ <<>>వరికుంట్ల సుబ్బయ్యకు బుధవారం మంత్రి అనిత సంతాపం తెలిపారు. సైన్యంలో 23 ఏళ్లు సేవలందించిన సుబ్బయ్య ప్రాణాలు కోల్పోయిన వార్త కలచివేసిందన్నారు. కానీ, మృత్యువు చేరువైందని తెలిసినా గో బ్యాక్ అంటూ సహచర జవాన్లను అప్రమత్తం చేసి తనువు చాలించారని, జవాన్ సుబ్బయ్య సాహసం ఆదర్శమని మంత్రి అనిత తన X ఖాతాలో పోస్ట్ చేశారు.

News December 11, 2024

ప్రకాశం జిల్లా రైతులకు గమనిక 

image

ప్రకాశం జిల్లాలో కంది సాగు చేసిన రైతులకు జాయింట్ కలెక్టర్ రోణంకి గోపాల కృష్ణ శుభవార్త చెప్పారు. రైతుల నుంచి ప్రభుత్వమే కందులు కొనుగోలు చేస్తుందని స్పష్టం చేశారు. ఇందులో భాగంగా ఈనెల 12వ తేదీ నుంచి కొనుగోలుకు రిజిస్ట్రేషన్ ప్రక్రియ ప్రారంభిస్తామని చెప్పారు. కంది సాగు చేసిన రైతులు తమ సమీపంలోని రైతు సేవా కేంద్రాల్లోకి వెళ్లి వివరాలు నమోదు చేయించుకోవాలని సూచించారు.

News December 11, 2024

ప్రకాశం జిల్లా జవాన్ ఎలా చనిపోయారంటే..?

image

ప్రకాశం జిల్లా కంభం మండలం <<14839505>>రావిపాడుకు చెందిన ఆర్మీ జవాన్<<>> వరికుంట్ల సుబ్బయ్య(43) జమ్మూలో సోమవారం మృతిచెందిన విషయం తెలిసిందే. 25వ రాష్ట్రీయ రైఫిల్స్‌ హవల్దార్‌గా పనిచేస్తున్న సుబ్బయ్య పూంచ్ సెక్టార్‌ వద్ద పహారా కాస్తున్నారు. ఈక్రమంలో పొరపాటున ల్యాండ్ మైన్‌పై కాలు పెట్టారు. తన ప్రాణం పోవడం ఖాయమని భావించారు. సహచర జవాన్లను ‘GO BACK’ అంటూ అలర్ట్ చేశారు. కాసేపటికే ల్యాండ్ మైన్‌ పేలడంతో వీర మరణం పొందారు.