News May 18, 2024

ప్రకాశం: పిడుగుపాటుకు వ్యక్తి మృతి

image

ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలం డివిఎన్ కాలనీలో శనివారం కురిసిన భారీ వర్షానికి చెట్టు కింద ఉన్న ఇంటిలో నివాసం ఉంటున్న అలగసాని నారాయణ (37) అనే వ్యక్తి పిడుగుపాటుకు గురయ్యాడు. దీంతో నారాయణ అక్కడికక్కడే మృతి చెందాడు. గమనించిన కుటుంబసభ్యులు మృతదేహాన్ని చూసి బోరున విలపించారు. ఎడతెరపి లేకుండా కురిసిన వర్షానికి తోడుగా పిడుగులు పడటంతో ఈ ప్రమాదం చోటుచేసుకుంది.

Similar News

News December 5, 2024

ప్రకాశం: సంచలనమైన సర్పంచ్ హత్యకేసు కొట్టివేత

image

2016లో సంచలనమైన సంతమాగులూరు గ్రామ సర్పంచ్ గడ్డం వెంకటరెడ్డి హత్యకేసులో బుధవారం ఒంగోలు న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. 8 సంవత్సరాలకు పైన న్యాయస్థానంలో విచారణ జరిగిన ఈ కేసులో నేర ఆరోపణకు సంబంధించి సరైన సాక్ష్యాలు లేకపోవడంతో ఒంగోలు సెషన్స్ న్యాయస్థానం న్యాయమూర్తి టి. రాజావెంకటాద్రి సెక్షన్ 235(1) కింద కేసును కొట్టి వేస్తున్నట్లు తీర్పు వెలువరించింది.

News December 5, 2024

మంత్రి అనితతో వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం కలెక్టర్

image

విపత్తులను సమర్థంగా ఎదుర్కొనేలా ప్రభుత్వ యంత్రాంగం ఎల్లప్పుడూ సన్నద్ధంగా ఉండాలని రాష్ట్ర హోం, విపత్తుల నిర్వహణ శాఖ మంత్రి అనిత అన్నారు. బుధవారం అన్ని జిల్లాల కలెక్టర్లతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రకాశం జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా పాల్గొన్నారు. కాన్ఫరెన్స్‌లో హోం మంత్రి మాట్లాడుతూ.. విపత్తుల సమయంలో ప్రాణనష్టం జరగకుండా చూడటం అత్యంత ప్రాధాన్యమన్నారు.

News December 4, 2024

నేడు రాజకీయ ఘనపాటి కొణిజేటి రోశయ్య వర్ధంతి

image

ఉమ్మడి ఆంద్రప్రదేశ్ మాజీ సీఎం, రాజకీయ ఘనపాటి కొణిజేటి రోశయ్య మరణించి నేటికీ 3 ఏళ్లు పూర్తయ్యాయి. చీరాల MLAగా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేసిన రోశయ్య అసెంబ్లీలో వరుసగా 7సార్లు, మొత్తం 15 సార్లు ఆర్థిక బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రిగా రికార్డ్ సృష్టించారు. ఆయన తమిళనాడు కర్ణాటక రాష్ట్ర గవర్నర్‌గా సేవలను అందించారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మంత్రి మండలిలో సుదీర్ఘకాలం పనిచేసిన అనుభవం ఆయన ఒక్కడికే సొంతం.