News July 27, 2024
ప్రకాశం: పెద్ద మనసు చాటుకున్న కలెక్టర్

మేడం.. నేను చదువుకుంటాను అంటూ ఓ విద్యార్థిని కోరగా జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పందించి కేజీబీవీ పాఠశాలలో ప్రవేశం పొందేలా చర్యలు తీసుకున్నారు. ఒంగోలులోని బాలసదనం జిల్లా కలెక్టర్ శనివారం సందర్శించారు. ఈ సందర్భంగా చిన్నారులను ఆప్యాయంగా పలకరించిన కలెక్టర్ అక్కడి అమ్మాయిలతో మాట్లాడిన సమయంలో, ఒకరు చదువుకుంటాను అంటూ కలెక్టరును కోరారు. వెంటనే ఆమె స్పందించి కేజీబీవీలో సీటు కేటాయించారు.
Similar News
News December 11, 2025
ప్రకాశం ఎస్పీ చొరవ.. వృద్ధుడి ఇబ్బందులకు చెక్!

ప్రకాశం ఎస్పీ హర్షవర్ధన్ రాజు చొరవతో కొండేపి మండలానికి చెందిన ఓ వృద్ధుడి సమస్య పరిష్కార దిశగా పయనించింది. కొండేపి మండలంకు చెందిన హరి నారాయణ (65) ఎస్పీ మీకోసం కార్యక్రమంలో సమస్యను విన్నవించుకున్నాడు. సమీప బంధువులు ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు తెలపగా.. ఎస్పీ ఆదేశాలతో కొండేపి ఎస్సై ప్రేమ్ కుమార్ వృద్ధుడి ఇంటికెళ్లి మాట్లాడారు. వృద్ధుడికి ఇబ్బంది కలిగించవద్దని ఎస్సై వారికి సూచించారు.
News December 11, 2025
రాచర్ల: స్వగ్రామంలో మాజీ MLA అంత్యక్రియలు

మాజీ MLA పిడతల <<18527850>>రామ్ భూపాల్ రెడ్డి<<>> స్వగ్రామం రాచర్ల మండలం అనుమలవీడు గ్రామం. కాగా ఆయన ఇవాళ తెల్లవారుజామున స్వర్గస్తులైన విషయం తెలిసిందే. వారి పార్థివదేహాన్ని గురువారం అనుమలవీడుకు తరలిస్తామని, గ్రామంలోనే శుక్రవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు వారి తనయుడు ప్రవీణ్ కుమార్ రెడ్డి తెలిపారు.
News December 11, 2025
గిద్దలూరు: రాజకీయంలో పిడతల కుటుంబం

గిద్దలూరు రాజకీయ ముఖ చిత్రంలో పిడతల కుటుంబం ప్రాధాన్యత అధికం. పిడతల రంగారెడ్డి 1937 నుంచి స్వాతంత్ర్యం కోసం పోరాటాలు చేసి, ఆ తర్వాత ఎమ్మెల్యే, మంత్రి, స్పీకర్గా పదవులు చేపట్టారు. 1991లో ఈయన కన్నుమూశారు. 1994 ఎన్నికల్లో పిడతల రాంభూపాల్ రెడ్డి ఎమ్మెల్యే అయ్యారు. 1999లో ఎమ్మెల్యేగా విజయ్ కుమార్ రెడ్డి గెలవగా.. 2001లో ఈయన మరణంతో ఉపఎన్నికలు జరిగాయి. ఈయన సతీమణి సాయికల్పన ఎమ్మెల్యే అయ్యారు.


