News May 18, 2024

ప్రకాశం: పెళ్లికి ఒప్పుకోలేదని తల్లీ కూతుళ్ళపై దాడి

image

పెళ్లికి నిరాకరించిందనే కక్షతో పామూరుకి చెందిన నాగార్జున యువతితో పాటు ఆమె తల్లిపై దాడి చేశాడు. కాంతమ్మ కూతురు పూజితతో కలిసి పాతూరులో నివాసం ఉంటుంది. సమీప బంధువైన నాగార్జున పూజిత పెళ్లి చేసుకోవాలని ఇబ్బంది పెట్టేవాడు. శుక్రవారం ఇంట్లోకి చొరబడి తల్లీకూతురిపై విచక్షణారహితంగా దాడి చేశాడు. పెళ్లికి ఒప్పుకుని, కాళ్లు పట్టుకొని బ్రతిమిలాడిన వినలేదు. ప్రస్తుతం వారు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.

Similar News

News November 2, 2025

వారికి రూ.10,000 బహుమతి: ఎమ్మెల్యే ఉగ్ర

image

జాతీయ రహదారి భద్రతను కాపాడటం మన అందరి బాధ్యత అని ఎమ్మెల్యే ముక్కు ఉగ్ర నరసింహారెడ్డి తెలిపారు. హైవే రోడ్డుపై ఇళ్ల నిర్మాణాల నుంచి వచ్చిన శిథిలాలు, మట్టి, వ్యర్థాలను రహదారి పక్కన వేస్తున్న వారి వల్ల ప్రమాదాలు సంభవించే అవకాశం ఉందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. జాతీయ రహదారి పక్కన శిధిలాలు వేసిన వారి వివరాలు లేదా ఫొటోలు, వీడియో సాక్ష్యాలు అందించిన వారికి రూ.10,000 బహుమతి అందజేస్తామని తెలిపారు.

News November 2, 2025

ప్రకాశం ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు..!

image

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ఈ క్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితో పాటు జాగ్రత్త వహించాలన్నారు. తీర ప్రాంతాలలో మన అప్రమత్తతే మనకు రక్ష అని సూచించారు.

News November 1, 2025

నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం: కలెక్టర్

image

తుఫాన్ వలన నష్టపోయిన రైతులందరిని ఆదుకుంటామని కలెక్టర్ రాజబాబు హామీ ఇచ్చారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడారు. రికార్డు స్థాయిలో తుఫాన్ వల్ల 20 సెంటీమీటర్ల వర్షం నమోదయిందన్నారు. ఫలితంగా వాగులు, వంకల ప్రవాహం పెరగడంతో పంట పొలాలు, రోడ్లు దెబ్బతిన్నట్లు తెలిపారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు వివరించారు.