News April 24, 2024
ప్రకాశం: పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.266

జిల్లాలోని పలు పొగాకు వేలం కేంద్రాల్లో సోమవారం నిర్వహించిన వేలంలో వెల్లంపల్లి, కొండపిలో పొగాకు కిలో గరిష్ఠ ధర రూ.266, ఒంగోలు-1 రూ. 265, ఒంగోలు-2 రూ. 261, టంగుటూరు రూ.263 చొప్పున పలికింది. ఎస్బీఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3,374 బేళ్లు తీసుకురాగా, అందులో 2,683 బేళ్లు, ఎస్ఎల్ ఎస్ రీజియన్ పరిధిలోని కేంద్రాల్లో 3,534 బేళ్లురాగా, అందులో 2,697 బేళ్లను కొనుగోలు జరిగాయి.
Similar News
News December 19, 2025
అనాథలను సొంత పిల్లలుగా భావించాలి: ప్రకాశం JC

తల్లిదండ్రులు లేని పిల్లలను సొంత పిల్లలుగా భావిస్తూ వారిని తీర్చిదిద్దాలని ప్రభుత్వ, ప్రభుత్వేతర స్వచ్ఛంద సంస్థలకు JC గోపాలకృష్ణ సూచించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో స్వచ్ఛంద సంస్థలతో ఆయన సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ.. అనాథలైన పిల్లలకు తప్పనిసరిగా బర్త్ సర్టిఫికెట్, ఆధార్ కార్డులు సమకూర్చాలన్నారు. 18ఏళ్లు దాటిన పిల్లలకు స్కిల్ డెవలప్మెంట్ కోర్స్ అందించాలని సూచించారు.
News December 19, 2025
వెనుకబడిన ప్రకాశం జిల్లా

సీఎం చంద్రబాబు వివిధ ర్యాంకులు ప్రకటించగా మన జిల్లా చాలా వాటిలో వెనుకబడింది. ఒంగోలు కార్పొరేషన్‌తో పాటు 6మున్సిపాల్టీల్లో రూ.71.19 కోట్ల పన్నులు రావాల్సి ఉండగా రూ.37.11 కోట్లే వసూళ్లు చేశారు. దీంతో రాష్ట్రంలో జిల్లా 19వ స్థానంలో నిలిచింది. నీటి పన్ను రూ.27.10 కోట్లు కాగా రూ.3.64కోట్ల వసూళ్లతో 22వ ర్యాంకు లభించింది. గ్రామీణ ఇళ్లు, స్థలాల స్వామిత్ర సర్వేలో మాత్రం జిల్లా అగ్రస్థానంలో నిలిచింది.
News December 19, 2025
20న ఒంగోలులో వ్యాసరచన పోటీలు: DEO

ఒంగోలులోని బండ్లమిట్ట ప్రభుత్వ బాలికల ఉన్నత పాఠశాలలో ఈనెల 20వ తేదీన వ్యాసరచన, వకృత్వ పోటీలు నిర్వహిస్తున్నట్లు డీఈవో రేణుక తెలిపారు. జాతీయ వినియోగదారుల దినోత్సవం పురస్కరించుకొని పోటీలను నిర్వహిస్తున్నామని గెలిచిన విజేతలకు రూ.5000, రూ.3000, రూ.2000 బహుమతులు అందిస్తామన్నారు. జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఉన్నత పాఠశాలల విద్యార్థులు పాల్గొనవచ్చని ఆమె తెలిపారు.


