News March 27, 2024
ప్రకాశం: పొగాకు గరిష్ట ధర రూ.231
ప్రకాశం జిల్లాలో సంతనూతలపాడు మండలం పేర్నమిట్ట వద్ద ఒంగోలు-1వ పాగాకు బోర్డు వేలం కేంద్రంలో మంగళవారం అమ్మకాలకు కొణిజేడు నుంచి 889 వేళ్లు రాగా 716 వేళ్లు అమ్ముడయ్యాయని సూపరింటెండెంట్ రవికాంత్ తెలిపారు. గరిష్ట ధర కేజీ రూ.231, కనిష్ట ధర రూ.220 పలికిందన్నారు. సరాసరి ధర రూ.228.13 వచ్చినట్లు చెప్పారు. కొనుగోలులో 21 కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2024
ఎందుకు నన్ను చూస్తే భయమేస్తోంది: తాటిపర్తి
కూటమి ప్రభుత్వం ఆర్థిక దోపిడీ చేయడానికి PAC ఛైర్మన్ పదవి ప్రతిపక్షానికి ఇవ్వలేదని యర్రగొండపాలెం MLA తాటిపర్తి చంద్రశేఖర్ విమర్శించారు. ‘పీయూసీ కమిటీ మెంబర్‌గా నామినేషన్ వేసిన నేనంటే చంద్రబాబు కుమారుడికి ఎందుకంత భయం? ఎందుకు ఇన్నిన్ని కేసులు పెడుతున్నారు? దళితులకు ఇచ్చే ప్రాధాన్యం ఇదేనా? మాదిగ జాతి బిడ్డలను ఇలా హింసించడం దారుణం. చంద్రబాబును దెబ్బకు దెబ్బ తీస్తాం’ అని ఎమ్మెల్యే హెచ్చరించారు.
News November 22, 2024
ఒంగోలు: ఇతను విమానాల్లో తిరిగే దొంగ
మధ్యాహ్న సమయంలో మాత్రమే దొంగతనాలు చేసే వ్యక్తి తిరుపతి పోలీసులకు చిక్కాడు. ప్రకాశం(D) సింగరాయకొండ(M) సోమరాజుపల్లికి చెందిన గురువిళ్ల అప్పలనాయుడు(29), చెడు అలవాట్లకు బానిసై 16వ ఏట నుంచి దొంగతనాలు చేస్తున్నాడు. విమానాల్లో తిరుగుతూ.. ఎంజాయ్ చేస్తుంటాడు. తిరుపతిలోని ఓ ఫైనాన్స్ ఆఫీసులో ఈనెల 15న రూ.8 లక్షలు దొంగలించడంతో పోలీసులు అరెస్ట్ చేశారు. సింగరాయకొండ, ఒంగోలు, విశాఖలో ఇతనిపై 18 కేసులు ఉన్నాయి.
News November 22, 2024
నామినేషన్ వేసిన ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్
అసెంబ్లీ ప్రభుత్వ రంగ సంస్థల కమిటీ (పీయూసీ) సభ్యుల ఎన్నికకు ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ నామినేషన్ దాఖలు చేశారు. ఈయన వైసీపీ నుంచి యర్రగొండపాలెం ఎమ్మెల్యేగా 5477 ఓట్లతో గూడూరి ఎరిక్షన్ బాబుపై గెలిచారు. ప్రకాశం జిల్లాలో వైసీపీ నుంచి గెలిచిన ఇద్దరు ఎమ్మెల్యేల్లో ఈయన ఒకరు.