News May 10, 2024

ప్రకాశం: ప్రచారం @ మరో 24 గంటలే

image

ఎన్నికల్లో కీలక ఘట్టమైన ప్రచారపర్వం మరో 24గంటల్లో ముగియనుంది. ఇన్నిరోజులు పార్టీల అభ్యర్థుల విమర్శలు, ఆరోపణలు, హామీలు నడుమ ప్రచార హోరు కొనసాగింది. ఇప్పటికే చంద్రబాబు, జగన్ జిల్లాలో విస్త్రత పర్యటనలు చేశారు. మరికొన్నిచోట్ల డబ్బుల ప్రలోభాలకు తెరలేసింది. రేపు సాయంత్రం 6వరకే అవకాశం ఉండగా అభ్యర్థులు ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారు.

Similar News

News February 8, 2025

సుగమ్య భారత్ యాత్రను ప్రారంభించిన ప్రకాశం కలెక్టర్

image

సమాజంలో దివ్యాంగులకు కూడా నూతన అవకాశాలు కల్పించినప్పుడే అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. విభన్నుల ప్రతిభావంతుల శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సుగమ్య భారత్ యాత్రను శుక్రవారం ప్రకాశం భవనం వద్ద కలెక్టర్‌తో పాటు రాష్ట్ర విభన్న ప్రతిభా వంతులశాఖ డైరక్టర్ రవిప్రకాశ్ రెడ్డి జండా ఊపి ప్రారంభించారు.

News February 7, 2025

కేంద్రమంత్రితో మంత్రి స్వామి భేటీ

image

ఢిల్లీలోని కేంద్ర సామాజిక న్యాయ, సాధికారత శాఖ మంత్రి వీరేంద్ర కుమార్‌తో శుక్రవారం మంత్రి స్వామి భేటి అయ్యారు. రాష్ట్రానికి రావాల్సిన నిధులపై కేంద్రమంత్రితో చర్చించారు. PM AJAY ఆదర్శ గ్రామ్ స్కీం కింద, రాష్ట్రంలో ఎంపిక చేసిన 526 గ్రామాల్లో అభివృద్ధి పనులకు రూ.110 కోట్లు విడుదల చేయాలన్నారు. 75 సాంఘిక సంక్షేమ నూతన వసతి గృహాల నిర్మాణానికి రూ.245 కోట్లు విడుదల చేయాలని కోరారు.

News February 7, 2025

చీమకుర్తి: ‘న్యాయం జరిగే వరకు నా శవాన్ని తీయొద్దు’

image

చీమకుర్తి మండలం ఏలూరువారిపాలెంకి చెందిన శీను(35) గురువారం ఆత్మహత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన రాసిన లెటర్‌తో సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. అందులో ‘నా చావుకు నా భార్య కుటుంబం. వాళ్లను వదిలిపెట్టొద్దు. నాకు న్యాయం జరిగేవరకు నా శవం కుళ్లినా తీయకండి. నాకు 10 ఏళ్ల క్రితం పెళ్లి అయింది. మెదటి రాత్రి తర్వాతి నుంచి నా భార్యతో గొడవలు జరుగుతున్నాయి.’ అని లెటర్లో పేర్కొన్నాడు.

error: Content is protected !!