News January 28, 2025
ప్రకాశం: ప్రజా ఫిర్యాదుల కార్యక్రమానికి 76 ఫిర్యాదులు

ప్రజా ఫిర్యాదులను పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ దామోదర్ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమానికి 76 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారులతో ముఖాముఖిగా మాట్లాడి వారి ఫిర్యాదుల వివరాలను తెలుసుకున్నారు. ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరిస్తామని జిల్లా ఎస్పీ భరోసా కల్పించారు.
Similar News
News January 8, 2026
రైతులకు రుణాలు మంజూరయ్యేలా చూడాలి: కలెక్టర్

రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రుణాలు మంజూరయ్యేలా చూడాలని కలెక్టర్ రాజాబాబు బ్యాంకు అధికారులను ఆదేశించారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో జిల్లా స్థాయి సాంకేతిక కమిటీ సమావేశాన్ని ఆయన గురువారం నిర్వహించి మాట్లాడారు. జిల్లాలో ఉద్యాన పంటల విస్తీర్ణాన్ని పెంచేలా సహకార బ్యాంకులు రైతులకు సరైన సమయంలో రుణాలు అందించాలన్నారు.
News January 8, 2026
దోర్నాల: ఆవుల మందపై పులి దాడి

దోర్నాల మండలం బొమ్మలాపురంలోని బీడు పొలంలో మేతకు వెళ్లిన ఆవుల మందపై పెద్ద పులి దాడి చేసింది. ఈ దాడిలో ఏరువా చెన్నారెడ్డికి చెందిన ఆవుకు గాయాలయ్యాయి. ఈ ఘటనతో బొమ్మలపురం గ్రామానికి చెందిన రైతులు, కూలీలు భయాందోళన చెందుతున్నారు. పెద్ద పులి సంచారంపై అటవీ శాఖ అధికారులు గతంలో గ్రామంలో అవగాహన కార్యక్రమాలు నిర్వహించారన్నారు. అధికారులు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు.
News January 8, 2026
గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించాలి: కలెక్టర్

77వ భారత గణతంత్ర వేడుకలను ఘనంగా నిర్వహించేలా విస్తృతంగా ఏర్పాట్లు చేపట్టాలని ప్రకాశం కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని కలెక్టర్ కార్యాలయంలో గురువారం జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజుతో కలిసి కలెక్టర్ సంబంధిత అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. ఈనెల 26న నిర్వహించనున్న గణతంత్ర వేడుకల కోసం అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మార్కాపురంలో సైతం ఘనంగా వేడుకలు నిర్వహించాలని కోరారు.


