News September 2, 2024
ప్రకాశం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 69 ఫిర్యాదులు
ప్రజల ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించుటకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో, ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ఎస్పీ దామోదర్ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి రాతపూర్వక పిర్యాదులు స్వీకరించి వారి సమస్యలను అడిగి తెలుసుకుని, వాటిని చట్టపరిధిలో విచారించి నిర్నీత గడువులో పరిష్కరిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 69 ఫిర్యాదులు వచ్చినట్లు ఎస్పీ తెలిపారు.
Similar News
News November 17, 2024
ఒంగోలు పోలీస్ స్పోర్ట్స్ మీట్‌లో గేమ్‌ల వివరాలు ఇవే
ఒంగోలు పోలీస్ ట్రైనింగ్ కళాశాలలో శనివారం నిర్వహించిన స్పోర్ట్స్ మీట్లో పోలీస్ శాఖలో వివిధ హోదాల్లో పనిచేస్తున్న వారు ఉత్సాహంగా పాల్గొన్నారు. పురుషులకు వాలీ బాల్, కబడ్డీ, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్‌తోపాటు అథ్లెటిక్స్ విభాగంలో పరుగు పందెం, లాంగ్ జంప్, హై జంప్, షాట్ పుట్ డిస్కస్ త్రో, మహిళలకు వాలీ బాల్, టగ్ ఆఫ్ వార్, షటిల్ బ్యాడ్మింటన్ పోటీలతోపాటు అథ్లెటిక్స్ నిర్వహిస్తున్నారు.
News November 16, 2024
ఒంగోలు వైసీపీ ఇన్‌ఛార్జ్ ఎవరంటే..?
ఒంగోలు మాజీ MLA బాలినేని శ్రీనివాసరెడ్డి YCPని వీడి జనసేనలో చేరిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో చుండూరి రవిబాబును YCP ఒంగోలు నియోజకవర్గ ఇన్‌ఛార్జ్‌గా ప్రకటించారు. దీంతో ఆయన నేపథ్యం ఏంటని అందరూ ఆరా తీస్తున్నారు. సీనియర్ NTరామారావు హయాంలో టీడీపీలోకి ప్రవేశించారు. 2004, 2009లో TDP టికెట్ ఆశించినా రాలేదు. బాలినేని శ్రీనివాసరెడ్డి పిలుపుతో YCPలో చేరారు. ఇతని స్వస్థలం నాగులుప్పలపాడు మండలం.
News November 16, 2024
మాజీ MLA టీజేఆర్‌కు కీలక బాధ్యతలు
ఇటీవల కాలంలో పలువురు వైసీసీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు అవుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో జగన్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వాళ్లకు అండగా నిలిచేందుకు సంతనూతలపాడు మాజీ MLA టీజేఆర్ సుదాకర్ బాబు, వెంకట రమణా రెడ్డిలకు బాధ్యతలు అప్పగించారు. ఉమ్మడి ప్రకాశం జిల్లాలోని కార్యకర్తలకు వీళ్లు అండగా ఉంటారని చెప్పారు. లీగల్ సెల్‌ను సమన్వయం చేసుకుంటూ కేడర్‌కు భరోసా ఇవ్వాలని జగన్ సూచించారు.