News November 19, 2024
ప్రకాశం: ప్రజా సమస్యల పరిష్కార వేదికకు 62 ఫిర్యాదులు
ప్రజల నుంచి వచ్చే ఫిర్యాదులను త్వరితగతిన పరిష్కరించేందుకు సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన పబ్లిక్ గ్రీవెన్స్ సెల్ కార్యక్రమానికి 62 ఫిర్యాదులు వచ్చాయి. ఈ కార్యక్రమంలో భాగంగా.. జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులతో ఎస్పీ దామోదర్ మాట్లాడారు. ఫిర్యాదులను చట్టపరిధిలో విచారించి పరిష్కరిస్తామని ఎస్పీ భరోసా కల్పించారు.
Similar News
News November 19, 2024
ఎమ్మెల్యే ఏలూరిపై సీఎం చంద్రబాబు ప్రశంసలు
అంతర్జాతీయ పురస్కారం అందుకున్న ఎమ్మెల్యే ఏలూరి సాంబశివరావుకు నారా <<14645103>>చంద్రబాబు నాయుడు ప్రశంసల జల్లు <<>>కురిపించారు. విజనరీ లీడర్ అవార్డు లభించడం పట్ల ఎమ్మెల్యే ఏలూరికి అధినేత చంద్రబాబు ఫోన్లో ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. ప్రజల అభ్యున్నతికి ఏలూరి చూపుతున్న దార్శనికతపై ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.
News November 18, 2024
BREAKING: దోర్నాల వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
ప్రకాశం జిల్లా దోర్నాల మండలంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. మండలంలోని కొత్తూరు సమీపంలో గల వెలిగొండ ప్రాజెక్టు వద్ద సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు లారీ-బైక్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న తల్లి, కూతురు లారీ టైర్ కింద పడి అక్కడికక్కడే మృతి చెందారు. బైకు నడుపుతున్న భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మరిన్ని వివరాలు తెలియాల్సిఉంది.
News November 18, 2024
ప్రకాశం: పిల్లలకు బైకులు ఇస్తున్నారా.. జాగ్రత్త!
పోలీసులు ప్రతిరోజు ఏదొక రూపంలో వాహనదారులు హెల్మెట్, సీట్ బెల్టులు పెట్టుకోండి అని హెచ్చరిస్తూనే ఉంటారు. కాని వాటిని తేలిగ్గా తీసుకుంటే జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో ఒంగోలులో జరిగిన ఘటన ఒక ఉదాహరణ. ముగ్గురు విద్యార్థులు స్కూటీపై హెల్మెట్ లేకుండా ప్రయాణించారు. అదే సమయంలో రోడ్డు పక్కన ఆపి ఉన్న ట్యాంకర్ను ఢీకొనడంతో ముగ్గురూ చనిపోయారు. అదే హెల్మెట్ ధరించి ఉంటే వారు బతికే వారని స్థానికులు పేర్కొన్నారు.