News July 3, 2024
ప్రకాశం: ప్రేమ పేరుతో మోసం.. యువకుడి అరెస్టు

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు హనుమంతునిపాడు ఎస్సై తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన అవినాశ్ కొంతకాలంగా బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి శారీరకంగా దగ్గరవడంతో గర్భం దాల్చింది. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అతను తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు.
Similar News
News February 25, 2026
ప్రశాంతంగా ముగిసిన సీఎం పర్యటన

పటిష్ఠ బందోబస్తు నడుమ సీఎం పర్యటన ప్రశాంతంగా ముగిసింది. బుధవారం ఉదయం వెలుగొండ ప్రాజెక్టు ఫీడర్ కెనాల్ పనుల శంకుస్థాపన కోసం దోర్నాల మండలం గంటవానిపల్లి పల్లికి విచ్చారు. అనంతరం మార్కాపురంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ప్రసంగించారు. పటిష్ఠమైన ప్రణాళిక, వివిధ శాఖల సమన్వయంతో పోలీసులు సీఎం పర్యటనను ఎటువంటి ఆటంకాలు లేకుండా సజావుగా సాగేలా చర్యలు తీసుకున్నారు.
News February 25, 2026
సీఎంను ప్రత్యేకంగా ఆకట్టుకున్న ఓ విద్యార్థిని చిత్రలేఖనం

మార్కాపురం బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రాల అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు వివరించారు. ఆ దేవుడితో పెట్టుకుంటే పతనం ఖాయమని హెచ్చరించారు.
News February 25, 2026
2021లోనే నీళ్లు ఇచ్చేవాడిని: సీఎం

2019 – 24లో సీఎంగా ఉండుంటే 2021లోనే వెలిగొండ ప్రాజెక్టును పూర్తి చేసి నీళ్లు ఇచ్చేవాడినని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పుకొచ్చారు. గిద్దలూరు, మార్కాపురం, ఎర్రగొండపాలెం, కనిగిరి అలాగే ఉదయగిరి, బద్వేల్‌కు 4,35,000 ఎకరాల సాగుకు నీళ్లు వచ్చేవన్నారు. ఆనాటి ముఖ్యమంత్రి దొంగ నాటకాలు ఆడి 2019 – 24 మధ్య కేవలం రూ.500 కోట్లు మాత్రమే ఖర్చుపెట్టారని విమర్శించారు.


