News July 3, 2024

ప్రకాశం: ప్రేమ పేరుతో మోసం.. యువకుడి అరెస్టు

image

ప్రేమ పేరుతో యువతిని మోసం చేసిన ఓ యువకుడిపై కేసు నమోదు చేసినట్లు హనుమంతునిపాడు ఎస్సై తెలిపారు. మండలంలోని ఓ గ్రామానికి చెందిన అవినాశ్ కొంతకాలంగా బంధువుల అమ్మాయిని ప్రేమిస్తున్నానంటూ వెంటపడ్డాడు. ఆమెకు మాయ మాటలు చెప్పి శారీరకంగా దగ్గరవడంతో గర్భం దాల్చింది. పెళ్లి ప్రస్తావన తీసుకురావడంతో అతను తప్పించుకు తిరుగుతున్నాడు. బాధితురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేసి నిందితుడిని రిమాండ్‌కు తరలించామన్నారు.

Similar News

News December 1, 2024

వేమవరం వద్ద రోడ్డు ప్రమాదం.. చిన్నారి మృతి

image

బల్లికురవ మండలంలోని వేమవరం వద్ద ఆదివారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సంతమాగులూరు మండలంలోని కొప్పరం గ్రామానికి చెందిన మునీర్ బాషా తన కుటుంబ సభ్యులతో కలిసి చిలకలూరిపేట నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. వేమవరం వద్ద వీరి బైక్‌ను లారీ ఢీకొనడంతో బైక్‌పై ఉన్న ఖాన్సా (13 నెలలు) అక్కడికక్కడే మృతి చెందింది. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు అక్కడికి చేరుకొని విచారణ చేపట్టారు.

News December 1, 2024

మాగుంట హత్యకు నేటికి 29 ఏళ్లు..!

image

ప్రకాశం జిల్లాలో తనకంటూ ఓ ముద్ర వేసుకున్న వ్యక్తి మాగుంట సుబ్బరామిరెడ్డి. నెల్లూరుకు చెందిన ఆయన 1991లో ఒంగోలు MPగా గెలిచారు. మాగుంట ట్రస్ట్‌తో పేదలకు ఉచిత మంచినీటి సరఫరా, ఆలయ, కళాశాల నిర్మాణాలు చేపట్టారు. ఆయనను పీపుల్స్ వార్ గ్రూప్ (PWG) నక్సలైట్లు 1995 డిసెంబర్ 1న హత్య చేశారు. ఆయన సతీమణి పార్వతమ్మ ఇటీవల అనారోగ్యంతో మృతిచెందారు. సోదరుడు శ్రీనివాసుల రెడ్డి ప్రస్తుతం ఒంగోలు MPగా ఉన్నారు.

News November 30, 2024

మద్దిపాడులో చిన్నారి మృతి

image

ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలంలోని గుండ్లాపల్లి గ్రోత్ సెంటర్ వద్ద శనివారం విషాద ఘటన చోటుచేసుకుంది. నాలుగేళ్ల బాలుడు సూర్య ఓ ఫ్యాక్టరీ గేట్ దగ్గర ఆడుకుంటుండగా.. ఒక్కసారిగా గేటు ఊడి బాలుడిపై పడింది. దీంతో బాలుడు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతి చెందిన బాలుడు అక్కడే పనిచేస్తున్న వాచ్‌మెన్ మనవడు అని సమాచారం.