News February 23, 2025
ప్రకాశం: ‘ఫేక్ డాక్యుమెంట్స్ సేకరించాలి’

ఒంగోలు, పరిసర ప్రాంతాలలో నకిలీ డాక్యుమెంట్లు, స్టాంపులు, ఫోర్జరీ సంతకాలతో రెండేళ్ళ క్రితం వెలుగుచూసిన భూ అక్రమాలపై.. రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి RP సిసోడియా అరా తీశారు. జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా, ఎస్పీ దామోదర్ జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణతో ప్రకాశం భవనంలో శనివారం ప్రత్యేక సమావేశం నిర్వహించారు. స్థలాలకు ఫేక్ డాక్యుమెంట్స్ ఎవరు సృష్టించారో ఆధారాలను సేకరించాలని ఆదేశించారు.
Similar News
News October 22, 2025
ఇసుక అక్రమ రవాణాపై కలెక్టర్కు ఫిర్యాదు

జరుగుమల్లి నుంచి కొందరు అక్రమంగా ఇసుకను ఒంగోలుకు తరలిస్తున్నారని ఫలితంగా ఒంగోలులో ఇసుక యార్డుల నుంచి సరఫరా చేసే తాము ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు కలెక్టర్ రాజా బాబుకు రవాణాదారులు ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ మార్గదర్శకాలకు విరుద్ధంగా ఆయా వనరుల నుంచి 5 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఇసుకను తరలిస్తున్న వాహనాలపై కఠిన చర్యలు తీసుకోవాలని
కలెక్టర్ అధికారులను ఆదేశించారు. అక్రమ ఇసుక రవాణాను అరికట్టాలన్నారు.
News October 22, 2025
విద్యుత్ షాక్ తో తండ్రి, కొడుకు మృతి..

పొదిలి మండలం సలకనూతల గ్రామం సమీపంలో మంగళవారం ఘోర విషాదం చోటుచేసుకుంది. పొలం పనులు ముగించుకొని భారీ వర్షంలో ట్రాక్టర్ పై గ్రామానికి వెళ్తున్న తండ్రి, కొడుకు విద్యుత్ స్తంభాన్ని ఢీకొనడంతో షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందారు. మృతులు మాదాల పెదకోటయ్య (60), మాదాల వెంకటేశ్వర్లు (25)గా గుర్తించారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు.
News October 21, 2025
ఇసుక అక్రమ రవాణాపై ఉక్కు పాదం మోపాలి: కలెక్టర్

ఇసుక అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలని కలెక్టర్ పి.రాజాబాబు అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన అధ్యక్షతన ఒంగోలు క్యాంపు కార్యాలయంలో జిల్లా స్థాయి ఇసుక కమిటీ సమావేశం నిర్వహించారు. జిల్లాలో ఇసుక లభ్యత, రవాణా, వర్షాకాలం దృష్ట్యా ముందుగానే ప్రజలకు అవసరమైన స్థాయిలో యార్డుల్లో అందుబాటులో ఉంచడం తదితర అంశాలను గనుల శాఖ డిప్యూటీ డైరెక్టర్ రాజశేఖర్ కలెక్టర్కు వివరించారు.