News October 4, 2024

ప్రకాశం: ‘బాణసంచా విక్రయాలకు దరఖాస్తు చేసుకోవాలి’

image

ప్రకాశం జిల్లాలో దీపావళి పండుగ సందర్భంగా బాణసంచా దుకాణాల ఏర్పాటుకు లైసెన్సుల కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి శ్రీలత శుక్రవారం తెలియజేశారు. ఆసక్తికలిగిన వారు తాత్కాలిక లైసెన్స్‌ కోసం ఈనెల 15లోగా మీసేవ కేంద్రాలు, సచివాలయాల ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. తహశీల్దార్లు, పోలీసు అధికారులు వ్యక్తిగతంగా పర్యవేక్షించి దీపావళి బాణసంచాను విక్రయించేందుకు అనువైన ప్రాంతాలను గుర్తించాలన్నారు.

Similar News

News November 25, 2025

అక్కడ ఆయన.. ఇక్కడ ఈయనపై విచారణ..!

image

తిరుమల వివాదాల్లో ఇద్దరు రాజకీయ నాయకులను ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారించాయి. కల్తీ నెయ్యి కేసులో HYDలో వైవీ సుబ్బారెడ్డిని సీబీఐ సిట్, పరకామణీ కేసులో తిరుపతిలో భూమన కరుణాకర్‌రెడ్డిని సీఐడీ విచారించడం ప్రస్తుతం హాట్ టాపిక్‌గా మారింది. గతంలో ఎన్నడు లేనివిధంగా టీటీడీలో చోటుచేసుకున్న వివాదాలు.. మాజీ ఛైర్మన్ల విచారణపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.

News November 25, 2025

ప్రకాశంలోకి అద్దంకి, కందుకూరు.. కారణం ఇదే!

image

ప్రకాశం జిల్లా నుంచి సరికొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పడనున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రకాశం నుంచి అద్దంకి బాపట్లలోకి, కందుకూరు నెల్లూరులోకి వెళ్లాయి. అద్దంకి నుంచి బాపట్లకు 80 కి. మీ ఉండగా ఒంగోలుకు 40 కి.మీ మాత్రమే. కందుకూరుకు ఇదే సుదూర సమస్య. తాజాగా వీటిని ప్రకాశంలోకి కలిపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ కామెంట్!