News March 22, 2025

ప్రకాశం: బెట్టింగ్ వేయకండి.. కాల్ చేయండి

image

ఐపీఎల్ వినోదం ఇవాళ్టి నుంచే మొదలు కానుంది. ఈక్రమంలో బెట్టింగ్ భూతం భయపడుతోంది. ఒంగోలు నగరంతో పాటు మారుమూల పల్లెల్లోని యువతను సైతం బెట్టింగ్‌‌లోకి లాగడానికి కొందరు ప్రయత్నిస్తున్నారు. ఈక్రమంలో పోలీసులు నిఘా పెంచారు. ఎక్కడైనా బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలిస్తే ఎవరైనా సరే 100, 112 నంబర్లతో పాటు 91211 02266కు కాల్ చేయాలని ఎస్పీ దామోదర్ కోరారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బెట్టింగ్ జోలికి వెళ్లకండి.

Similar News

News November 7, 2025

ప్రకాశం: భారీగా పెరిగిన పొగాకు ధర.. కానీ!

image

ప్రకాశం జిల్లాలో పొగాకు ధరలు భారీగా పెరిగాయి. మార్చి 10న వేలం ప్రారంభమప్పుడు గరిష్ఠ ధర KG రూ.280గా ఉంది. తర్వాత క్రమంగా పెరిగింది. తుఫాన్ ముందు రూ.315 ఉండగా వారం లోపే ప్రస్తుతం రూ.362కి చేరింది. వేలం ముగింపు వేళ ధర పెంచి.. వచ్చే సీజన్‌లో రైతులు ఎక్కువ సాగు చేసేలా కంపెనీలు కుట్రలు చేస్తున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. హైగ్రేడ్ ధరలు పెరిగినప్పటికీ లోగ్రేడ్ కేజీ రూ.150 నుంచి రూ.50కి పడిపోవడం గమనార్హం.

News November 7, 2025

మర్రిపూడి: ఆలయ పునర్నిర్మాణానికి రూ.3.55 కోట్ల ప్రతిపాదనలు

image

మర్రిపూడి మండలంలో ఉన్న పృదులగిరి దేవస్థానం పునర్నిర్మాణం కోసం రూ.3.55 కోట్లు మంజూరు కోసం రాష్ట్ర మంత్రి స్వామి ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపించారు. పవిత్ర పుణ్య క్షేత్రాన్ని అభివృద్ధి చేయాలని దశాబ్దాలుగా భక్తులు కోరుతున్నారు. ఈ ఏడాది ఘాట్ రోడ్ నిర్మాణానికి రూ.4 కోట్లు నిధులు మంజూరు చేయించగా.. ప్రస్తుతం ఆలయ పునర్నిర్మాణానికి రూ.3.55 కోట్లు ప్రతిపాదనలు పంపించడంతో భక్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

News November 6, 2025

ప్రకాశం జిల్లాలో 213 వాహనాలకు జరిమానా

image

ప్రకాశం వ్యాప్తంగా బుధవారం స్పెషల్ డ్రైవ్ చేపట్టారు. 2,044 వాహనాలను తనిఖీ చేసినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. సరైన ధ్రువీకరణ పత్రాలు లేని 213 వాహనాలను గుర్తించి రూ.1.56లక్షల జరిమానా విధించారు. డ్రైవింగ్‌పై పూర్తి దృష్టి కేంద్రీకరించి, ప్రమాదాలు జరగకుండా చూడాలని పోలీసులు సూచించారు.