News March 18, 2024
ప్రకాశం: బైక్ అదుపుతప్పి యువకుడి మృతి

అతివేగంగా వస్తున్న బైకు అదుపు తప్పడంతో ఓ యువకుడు మృతిచెందాడు. ఈ ఘటన మద్దిపాడు ఫ్లైఓవర్‌పై సోమవారం సాయంత్రం జరిగింది. చిత్తూరు జిల్లాకు చెందిన కొందరు ఒంగోలు కేంద్రంగా ఉంటూ చుట్టుపక్కల ప్రాంతాల్లో రోజువారి వడ్డీ వ్యాపారం చేస్తున్నారు. ఈ క్రమంలో ఇచ్చిన అప్పులను వసూలు చేసుకుని తిరిగి ఒంగోలు వెళ్తుండగా బైక్ అదుపు తప్పి డివైడర్‌ను కొట్టింది. దీంతో జగదీష్ అక్కడికక్కడే మృతిచెందాడు.
Similar News
News February 26, 2026
మార్కాపురంలో సీఎంను ఆకట్టుకున్న విద్యార్థిని చిత్రలేఖనం

మార్కాపురం బహిరంగ సభలో ఓ విద్యార్థిని గీసిన చిత్రలేఖనం సీఎం చంద్రబాబును ప్రత్యేకంగా ఆకట్టుకుంది. మార్కాపురం జిల్లా చెన్నకేశవ స్వామి గోపురం, సీఎం చిత్రాల అందంగా ఉండడంతో విద్యార్థినిని సీఎం అభినందించారు. ఈ చిత్రలేఖనంలో చాలా అర్థం దాగి ఉందని ప్రజలకు వివరించారు. ఆ దేవుడితో పెట్టుకుంటే పతనం ఖాయమని హెచ్చరించారు.
News February 26, 2026
వెలిగొండ పూర్తయితే 3 జిల్లాలకు ప్రయోజనం

కడప, ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు సాగు, తాగునీరు అందించేందుకు వెలిగొండ ప్రాజెక్ట్ రూపుదిద్దుకుంటుంది. 43.5 TMCల వరద నీటిని నల్లమల్లసాగర్ రిజర్వాయర్ ద్వారా మళ్లించి 19.2 కిలోమీటర్ల పొడవైన టన్నెల్స్‌తో నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టు 4.47 లక్షల ఎకరాలకు సాగునీరు, 15 లక్షల మందికి తాగునీరు అందించేలా రూపొందించారు. ఈ ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం వేగవంతం చేసి 2026కి పూర్తిచేస్తామని CM చంద్రబాబు పూనుకున్నారు.