News October 4, 2024

ప్రకాశం: బైక్‌ టైర్‌లో చున్నీ ఇరుక్కుని.. మహిళ మృతి

image

సంతమాగులూరు మండలం ఏల్చూరులోని పెట్రోల్ బంక్ సమీపంలో శుక్రవారం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. బైక్ వెనుక టైర్‌లో చున్నీ చుట్టుకోవడంతో రోడ్డు మీదపడి బల్లికువ మండలం కొప్పెరపాడుకు చెందిన మహిళా అక్కడకక్కడే మృతి చెందింది. నరసరావుపేట నుంచి కొప్పెరపాడు వైపు వెళుతుండగా ప్రమాదం జరిగినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు.

Similar News

News February 17, 2026

బీచ్ ఫెస్ట్ సక్సెస్.. పోలీసులను అభినందించిన SP

image

పాకల బీచ్ ఫెస్టివల్‌లో విశ్రాంతి లేకుండా పనిచేసిన పోలీసు సిబ్బందిని SP హర్షవర్ధన్ సోమవారం అభినందించారు. 2 రోజులపాటు అహర్నిశలు కృషిచేసిన పోలీసు అధికారులు, సిబ్బంది, ట్రైనీ కానిస్టేబుళ్లు, హోంగార్డుల పనితీరును ఆయన ప్రశంసించారు. సింగిల్ రోడ్డు ప్రవేశ మార్గాల్లో ట్రాఫిక్ నియంత్రణ, VIP కదలిక సమన్వయం సమర్థవంతంగా చేయడం అభినందనీయమని SP అన్నారు.

News February 16, 2026

ప్రకాశం: నేడే లాస్ట్.. అప్లై చేశారా?

image

ప్రకాశం డివిజన్ పరిధిలోని అన్నబోయినపల్లి, చాగళ్లు, దూబగుంట, జె.పంగలూరు, కందలూరు, మర్లపాడు, ఎం. నిడమనూరుతో పాటు 52 చోట్ల BPM, ABPM పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదలైంది. రూ.12 వేల నుంచి రూ.24,470 జీతం లభిస్తుంది. పదో తరగతి పాసైతే చాలు. దరఖాస్తుకు ఇవాళే చివరి తేదీ. 52 పోస్టుల ఖాళీల వివరాల కోసం ఇక్కడ <>క్లిక్<<>> చేయండి.