News August 3, 2024
ప్రకాశం: బ్యాంకులో చోరీకి యత్నించిన మహిళ

యూనియన్ బ్యాంకులో ఓ మహిళ దొంగతనానికి యత్నించిన ఘటన త్రిపురాంతకం మండలం మేడపి యూనియన్ బ్యాంకులో గురువారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. పోలీసుల వివరాల ప్రకారం.. ఓ మహిళ బ్యాంక్ షటర్ తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి లాకర్ తాళాలు రాకపోవడంతో వెనుదిరిగింది. సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా బ్యాంకులో చోరీ చేసేందుకు ఓ మహిళతో పాటు మరో వ్యక్తి వచ్చినట్లు దర్శి డీఎస్పీ అశోకవర్థన్ తెలిపారు.
Similar News
News October 17, 2025
దేశ అభివృద్ధికి యువతే వెన్నెముక: కలెక్టర్

భారతదేశ అభివృద్ధికి యువతే వెన్నెముకని జిల్లా కలెక్టర్ పి.రాజాబాబు అన్నారు. యువతలోని శక్తి, మేధోసంపత్తి సమాజానికి ఎంతో ఉపయోగపడాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లా యువజన వ్యవహారాల శాఖ స్టెప్ ఆధ్వర్యంలో శుక్రవారం ఒంగోలులోని స్థానిక ఇంజినీరింగ్ కాలేజీలో జరిగిన జిల్లా స్థాయి యువజన ఉత్సవాల్లో కలెక్టర్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అనంతరం మాట్లాడుతూ.. యువత దేశ ఉన్నతికి పాటుపడాలన్నారు.
News October 17, 2025
వీరయ్య చౌదరి హత్య.. జైలు నుంచి సురేశ్ విడుదల

ఒంగోలులోని తన కార్యాలయంలో ఏప్రిల్ 24న టీడీపీ నేత వీరయ్య చౌదరి హత్యకు గురైన విషయం తెలిసిందే. ఈ కేసులో కీలక నిందితుడు ముప్పా సురేశ్ను ఆగస్ట్ 19న అరెస్ట్ చేశారు. ఒంగోలు జైల్లో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు కోర్టు బుధవారం బెయిల్ ఇచ్చింది. ఆ పత్రాలు జైలుకు చేరడంతో ఆయన జైలు నుంచి విడుదలయ్యారు. ప్రతి ఆదివారం ఒంగోలు తాలుకా స్టేషన్కు హాజరు కావాలని కోర్టు షరతులు విధించింది.
News October 17, 2025
ప్రభుత్వాలు మారినా దోపిడీ ఆగడం లేదు..!

వెలిగొండ ప్రాజెక్ట్ పనులకు ప్రభుత్వం ఇటీవల రూ.456కోట్లు ఇవ్వగా త్వరలోనే R&R ప్యాకేజీ విడుదల చేయనుంది. సుంకేసుల, కలనూతల, గుండంచెర్లలోని 5వేలమందికి ఈ పరిహారం అందనుంది. ఈక్రమంలో కొందరు నాయకులు పరిహారం కావాలంటే ముందుగా రూ.20వేలు ఇవ్వాలని నిర్వాసితుల నుంచి వసూళ్లు చేస్తున్నారంట. గత ప్రభుత్వంలోనూ ఇలాగే నాయకులు దోపిడీ చేయగా కలెక్టర్కు ఫిర్యాదులు వెళ్లాయి. మిమ్మల్ని ఇప్పుడు ఎంత అడిగారో కామెంట్ చేయండి.