News September 7, 2024
ప్రకాశం బ్యారేజ్ గేట్లు ధ్వంసంపై పోలీసులకు ఫిర్యాదు

ప్రకాశం బ్యారేజ్ గేట్లు ఇటీవల ధ్వంసం అయిన విషయం తెలిసిందే. ఈ మేరకు శుక్రవారం సాయంత్రం ఇరిగేషన్ శాఖ అధికారులు గేట్ల ధ్వంసంపై విచారణ చేయాలని విజయవాడ వన్ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇరిగేషన్ శాఖ ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తామని పోలీసులు తెలిపారు. కాగా ఆ గేట్లు శుక్రవారం మరమ్మతులు చేశారు.
Similar News
News December 10, 2025
గుంటూరు జిల్లాలో 4.78 లక్షల సంతకాలు

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైసీపీ చేపట్టిన సంతకాల సేకరణ ముగిసింది. జిల్లాలోని 7 నియోజకవర్గాల నుంచి మొత్తం 4,78,000 సంతకాలు సేకరించినట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు తెలిపారు. సేకరించిన సంతకాల పత్రాలను జిల్లా పార్టీ కార్యాలయానికి అందజేశారు. కార్యక్రమంలో పలువురు వైసీపీ ముఖ్యనాయకులు పాల్గొన్నారు.
News December 10, 2025
మంగళగిరి ఎయిమ్స్లో 30 లక్షలు దాటిన వైద్య సేవలు

మంగళగిరి ఎయిమ్స్ ఆసుపత్రి వైద్య సేవల్లో మరో మైలురాయిని దాటిందని అధికారులు తెలిపారు. ఔట్ పేషెంట్ సేవలు ప్రారంభించినప్పటి నుంచి ఇప్పటివరకు మొత్తం 30 లక్షల మందికి సేవలు అందించినట్లు బుధవారం వెల్లడించారు. గత ఆరు నెలల్లోనే 5 లక్షల ఓపీ నమోదైందన్నారు. ప్రజలు తమపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటూ, మరింత మెరుగైన సేవలు అందించడానికి సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
News December 10, 2025
GNT: 16న కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు

మంగళగిరి 6వ బెటాలియన్లో ఈ నెల 16న కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాల పంపిణీ కార్యక్రమం జరగనుంది. సీఎం చంద్రబాబు ముఖ్య అతిథిగా హాజరై, ఎంపికైన అభ్యర్థులకు పత్రాలు అందజేస్తారు. ఈ మేరకు జరుగుతున్న ఏర్పాట్లను బుధవారం గుంటూరు ఎస్పీ వకుల్ జిందాల్, కలెక్టర్ క్షేత్రస్థాయిలో పరిశీలించారు. అధికారులతో సమీక్షించి భద్రతా ఏర్పాట్లపై దిశానిర్దేశం చేశారు.


