News January 7, 2025
ప్రకాశం: భయపడుతున్న ఫేక్ లబ్ధిదారులు..!
ఉమ్మడి ప్రకాశంలో జిల్లాలోని ఫేక్ పెన్షన్లపై అధికారులు నిన్నటి నుంచి తనిఖీలు చేస్తున్నారు. ఈక్రమంలో కొందరిలో టెన్షన్ నెలకొంది. కొండపి మండలంలో నకిలీ వికలాంగుల పెన్షన్దారులను గుర్తించేందుకు ఎంపీడీఓ నేతృత్వంలో డాక్టర్లు పర్యటించారు. వీరి రాకను గమనించిన కొందరు నకిలీ పెన్షన్దారులు ఇళ్లకు తాళాలువేసి ఊరెళ్లారని తెలుస్తోంది. మరికొందరు కనిపించకుండా పరారయ్యారని సమాచారం.
Similar News
News January 9, 2025
మార్కాపురంలో రోడ్డు ప్రమాదం.. ఒకరు మృతి
మార్కాపురం కోమటికుంట – జమ్మనపల్లి రోడ్డులో గురువారం రోడ్డు ప్రమాదం జరిగింది. స్కూటీపై ప్రయాణిస్తున్న ఇద్దరు మహిళలను టిప్పర్ లారీ ఢీకొట్టి 100 అడుగుల దూరం వరకు ఈడ్చుకొని వెళ్ళింది. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి. గాయపడిన మహిళను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
News January 9, 2025
అర్జీలను సత్వరమే పరిష్కరించాలి: ప్రకాశం కలెక్టర్
రెవెన్యూ సదస్సులలో వచ్చిన అర్జీలను సత్వరమే పరిష్కరించాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా స్పష్టం చేశారు. ఈ నెల 8వ తేదీతో రెవెన్యూ సదస్సులు ముగిసిన నేపథ్యంలో అన్ని మండలాల తహశీల్దార్లు, మండల సర్వేయర్లతో ఆమె ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రెవిన్యూసమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యాన్ని వివరించారు.
News January 9, 2025
వైకుంఠ ఏకాదశి.. ప్రకాశం ఎస్పీ కీలక ఆదేశాలు
వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని శుక్రవారం జిల్లా వ్యాప్తంగా ప్రముఖ దేవాలయాల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ప్రకాశం జిల్లా ఎస్పీ ఏఆర్ దామోదర్ తెలిపారు. గురువారం మధ్యాహ్నం ఆయన మీడియాతో మాట్లాడారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యాలు కలగకుండా దర్శనం జరిగేలా చూడాలని పోలీస్ అధికారులను ఎస్పీ ఆదేశించారు. భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి అవాంచనీయ ఘటనలకు తావు లేకుండా చర్యలు చేపట్టామన్నారు.