News May 25, 2024
ప్రకాశం: భార్యను హతమార్చి తప్పించుకునేందుకు ప్లాన్.. అక్కడే ట్విస్ట్

భార్యను హత్య చేసి, ఆపై తప్పించుకునేందుకు విఫలయత్నం చేశాడో కసాయి భర్త. పోలీసుల వివరాల ప్రకారం.. కొనకమిట్ల మండలానికి చెందిన మధులత, దర్శికి చెందిన పరకాల నాగేంద్ర దంపతులు. ఈనెల 4న రాత్రి వారి మధ్య గొడవ కాగా.. నాగేంద్ర ఆవేశంలో భార్యను కత్తితో పొడిచి హతమార్చాడు. మృతదేహాన్ని ముక్కలు చేయాలనుకొని, ఆపై గ్యాస్ లీక్ చేసి ప్రమాదంగా చిత్రీకరించాలనుకున్నాడు. పోలీసుల దర్యాప్తులో నిజం తేలడంతో కటకటాల పాలయ్యాడు.
Similar News
News December 15, 2025
ప్రకాశం జిల్లా కానిస్టేబుల్ అభ్యర్థులకు గుడ్ న్యూస్.!

మంగళగిరిలోని APSP 6వ బెటాలియన్ పరేడ్ గ్రౌండ్లో రేపు CM చంద్రబాబు చేతులమీదుగా కానిస్టేబుల్ అభ్యర్థులకు నియామక పత్రాలు జారీ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ప్రకాశం జిల్లా నుంచి కానిస్టేబుళ్లుగా ఎంపికైన 281 మంది అభ్యర్థులు మంగళవారం ఉదయం ఒంగోలు SP కార్యాలయం నుంచి మంగళగిరికి బయలుదేరతారు. సివిల్ ఉమెన్ కానిస్టేబుల్స్ 38 మంది, సివిల్ కానిస్టేబుల్స్ 88 మంది, ఏపీఎస్పీ 155 మంది వీరిలో ఉన్నారు.
News December 15, 2025
ప్రకాశం ఎస్పీ మీకోసంకు 90 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 90 ఫిర్యాదులు అందినట్లు SP కార్యాలయం ప్రకటించింది. ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఎస్పీ మీకోసం కార్యక్రమంలో పాల్గొని, ఫిర్యాదుదారుల సమస్యలను పూర్తిస్థాయిలో అడిగి తెలుసుకున్నారు. అనంతరం సంబంధిత పోలీస్ శాఖ అధికారులకు వెంటనే విచారణ నిర్వహించి మీకోసం ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ ఆదేశించారు.
News December 15, 2025
అమర జీవికి సెల్యూట్ చేసిన ప్రకాశం SP.!

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అమరజీవి చిత్రపటానికి ఎస్పీ హర్షవర్ధన్ రాజు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం గౌరవ వందనంగా SP సెల్యూట్ చేశారు. ఎస్పీ మాట్లాడుతూ.. తెలుగు ప్రజలకోసం ప్రత్యేక రాష్ట్ర సాధన లక్ష్యంగా అమరజీవి ఆమరణ నిరాహార దీక్షతో ఆత్మార్పణ చేసి అమరులయ్యారన్నారు.


