News January 13, 2025

ప్రకాశం: భోగి మంట వేస్తున్నారా?

image

సంక్రాంతి వేడుకలో మొదటి రోజు భోగి. తెల్లవారుజామున భోగి మంటలు వేయడంతో పండుగ సెలబ్రేషన్స్‌ మొదలవుతాయి. ఇంటింటా ఉత్సాహంగా భోగి మంటలు వేసుకుంటారు. మరి మీరూ రేపు భోగి మంట వేస్తున్నారా? మీసెలబ్రేషన్స్‌‌ను వే2న్యూస్‌లో చూడాలనుకుంటున్నారా? అయితే మీ భోగి మంటను వీడియో తీసి ఈ 97036 22022కు వాట్సాప్ చేయండి. మీ గ్రామం, మండలం పేర్లు తప్పక పంపండి. మేము పబ్లిష్ చేస్తాం.

Similar News

News February 9, 2025

త్రాగునీటి సమస్యలు తలెత్తకూడదు: గొట్టిపాటి

image

జిల్లాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని మంత్రి గొట్టిపాటి రవికుమార్ అన్నారు. ఒంగోలులో ఆదివారం జరిగిన జిల్లా ప్రజా పరిషత్ సర్వసభ్య సమావేశంలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, స్వామి, జడ్పీ ఛైర్ పర్సన్ బూచేపల్లి వెంకాయమ్మ పాల్గొన్నారు. మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. రానున్న వేసవి కాలాన్ని దృష్టిలో ఉంచుకొని త్రాగునీటి సమస్యలు తలెత్తకుండా అన్ని చర్యలు తీసుకోవాలన్నారు.

News February 9, 2025

ప్రకాశం జిల్లా ఎస్పీ కీలక సూచనలు

image

ఒంగోలులో ఆదివారం రైజ్ కళాశాల, టెక్ బుల్ సమస్థ అధ్వర్యంలో 5K రన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ దామోదర్ మాట్లాడుతూ.. ద్విచక్ర వాహనదారుల ప్రాణాలకు హెల్మెట్  రక్షణ కవచం లాంటిదన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్లు ధరించాలని ఆయన సూచించారు.  ఈ రన్‌లో పాల్గొన్న  ప్రజలకు క్యాన్సర్, మత్తు పదార్థాల నియంత్రణపై అవగాహన కల్పించాలని ఎస్పీ పిలుపు నిచ్చారు.

News February 9, 2025

బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దు: కలెక్టర్

image

మాదక ద్రవ్యాలకు బానిసై బంగారు భవిష్యత్‌ను నాశనం చేసుకోవద్దని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా అన్నారు. రైజ్ కళాశాల, టెక్ బుల్ సంస్థ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం ఒంగోలులో 5K రన్ నిర్వహించారు. క్యాన్సర్‌పై అవగాహన, మాదకద్రవ్యాల నివారణ కోసం ఈ కార్యక్రమం నిర్వహించారు. స్థానిక మినీ స్టేడియం వద్ద ప్రారంభమైన ఈ పరుగు మినీ స్టేడియం వద్ద ముగిసింది

error: Content is protected !!