News October 11, 2024
ప్రకాశం: మద్యం దరఖాస్తులు అక్కడ ఎక్కువ.. ఇక్కడ తక్కువ

ప్రకాశం జిల్లాలో మద్యం షాపులకు దరఖాస్తులు వెల్లువలా వస్తున్నాయి. శుక్రవారం ఉదయం 8 గంటల వరకు అధికార వెబ్‌సైట్ ప్రకారం.. కనిగిరి రూరల్‌లోని షాప్ నంబర్ 123కు అత్యల్పంగా 4 దరఖాస్తులు రాగా.. అత్యధికంగా చీమకుర్తి రూరల్‌లోని షాప్ నంబర్ 58కి 43మంది దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆ షాపునకు రూ.కోటీ 16 లక్షలు ఫీజు రూపంలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇవాళ చివరి రోజు కావడంతో ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది.
Similar News
News December 29, 2025
ప్రజల్లో విశ్వాసం పెంచాలి: ప్రకాశం కలెక్టర్

ప్రజల్లో విశ్వాసం పెంచడమే లక్ష్యంగా పోలీసులు పని చేయాలని కలెక్టర్ రాజాబాబు అన్నారు. ఒంగోలులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో సోమవారం నిర్వహిస్తున్న పోలీస్ శాఖ వార్షిక నేర సమీక్ష సమావేశంలో ఎస్పీ హర్షవర్ధన్‌రాజుతో కలిసి కలెక్టర్ పాల్గొన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ.. నేరాల నియంత్రణతోపాటు సత్వర విచారణ, బాధితులకు న్యాయం జరిగేలా చూడాలన్నారు. విచారణలో సాంకేతిక పరిజ్ఞానం విస్తృతంగా ఉపయోగించాలన్నారు.
News December 29, 2025
ప్రకాశం: నేటి కార్యక్రమం రద్దు

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేడు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.
News December 28, 2025
రేపు ప్రకాశం ఎస్పీ మీ కోసం కార్యక్రమం రద్దు

పోలీసుల వార్షిక నేర సమీక్షా సమావేశం జరగనున్న దృష్ట్యా, ప్రకాశం జిల్లా పోలీస్ కార్యాలయంలో రేపు నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్‌ఎస్) కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేసినట్లు ఎస్పీ హర్షవర్ధన్ రాజు తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గమనించి, ఒంగోలులోని ఎస్పీ కార్యాలయానికి సోమవారం మీకోసం ఫిర్యాదుల నిమిత్తం రావద్దని ఎస్పీ కోరారు.


