News October 18, 2024

ప్రకాశం: మద్యం మత్తులో భార్య గొంతు కోసిన భర్త

image

కుటుంబ కలహాలతో మద్యం మత్తులో ఓ భర్త తన భార్య గొంతు కోసిన ఘటన గురువారం చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. సింగరాయకొండ మండలంలోని ఊళ్లపాలెంలో పుట్టా వెంకట్రావు, తిరుపతమ్మలకు ఐదేళ్లక్రితం వివాహమైంది. కాగా గురువారం మద్యం తాగి ఇంటికి వచ్చిన భర్తకు తిరుపతమ్మకు మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో తిరుపతమ్మ భర్తను కర్రతో కొట్టగా.. ఆగ్రహించిన భర్త కత్తితో ఆమె గొంతు కోశాడు. దీంతో తిరుపతమ్మ మృతి చెందింది.

Similar News

News November 12, 2024

బాధితులకు సత్వర న్యాయం అందిస్తాం: ప్రకాశం ఎస్పీ

image

ప్రకాశం జిల్లా వ్యాప్తంగా బాధితులు నుంచి వచ్చే ఫిర్యాదులను పరిష్కరించుటకు కోసం సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టమ్‌) కార్యక్రమాన్ని జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఏఆర్ దామోదర్ నిర్వహించారు. జిల్లాలో పలు ప్రాంతాల నుంచి వచ్చిన 90 ఫిర్యాదుదారుల అర్జీలను ఎస్పీ స్వయంగా స్వీకరించి వారితో ముఖాముఖిగా మాట్లాడి, త్వరితగతిన పరిష్కరిస్తామని బాధితులకు భరోసా కల్పించారు.

News November 12, 2024

పొన్నలూరు: భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య

image

పొన్నలూరు గ్రామానికి చెందిన గోసుల సుజాత తన భర్త పెట్టే వేధింపులు భరించలేక ఈ నెల 6న ఎలుకల మందు తిని ఆత్మహత్యకు పాల్పడింది. కుటుంబ సభ్యులు ఆమెకు ఒంగోలు రిమ్స్ హాస్పిటల్‌లో చికిత్స చేయిస్తుండగా ఆదివారం రాత్రి మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. పొన్నలూరు ఎస్సై అనూక్ సోమవారం కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం చేయించారు. అనంతరం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు.

News November 11, 2024

మార్కాపురంలో కానిస్టేబుల్ సూసైడ్

image

కుటుంబ కలహాల నేపథ్యంలో కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మార్కాపురం మండలంలో చోటుచేసుకుంది. కొట్టాలపల్లికి చెందిన వేముల మస్తాన్ మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన మస్తాన్ తెల్లవారుజామున ఇంట్లో  ఆత్మహత్యకు పాల్పడ్డాడు.