News April 6, 2024

ప్రకాశం: మహిళపై గడ్డపారతో దాడి.. ఏడాది జైలు శిక్ష

image

ప్రహరీ వివాదంలో మహిళపై గడ్డపారతో దాడిచేసిన వ్యక్తికి న్యాయస్థానం ఏడాది పాటు జైలు శిక్ష రూ.200 జరిమానా విధించింది. గిద్దలూరు మండలం అంబవరం గ్రామంలో నరేంద్ర తన స్థలంలో ప్రహరీ నిర్మిస్తుండగా వెంకటసుబ్బయ్య గడ్డపారతో దాడి చేశాడు. పక్కనే ఉన్న నరేంద్ర భార్య రమణమ్మ తలకు తగిలి గాయమైంది‌. ఈ ఘటనపై గిద్దలూరు పోలీసు స్టేషన్లో కేసు నమోదైంది. విచారణ అనంతరం జడ్జి మేరీ నిందితునికి ఏడాదిపాటు పాటు శిక్ష విధించారు.

Similar News

News January 26, 2025

ప్రకాశం కలెక్టర్‌కు అవార్డు

image

ప్రకాశం క‌లెక్ట‌ర్ తమీమ్ అన్సారియాకు బెస్ట్ ఎల‌క్టోర‌ల్ ప్రాక్టీసెస్ అవార్డు 2024 ల‌భించింది. శ‌నివారం విజ‌య‌వాడ‌లోని జ‌రిగిన 15వ జాతీయ ఓట‌ర్ల దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో రాష్ట్ర ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శి కె.విజ‌యానంద్ చేతుల‌మీదుగా అందుకున్నారు. అత్యంత పార‌ద‌ర్శ‌కంగా ఓట‌ర్ల జాబితా రూప‌క‌ల్ప‌న‌, అర్హులైన వారి ఓట‌రుగా న‌మోదు చేసుకునేందుకు అత్యుత్తమ పనితీరు కనపరిచినందుకు అవార్డు అందుకున్నారు.

News January 25, 2025

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకం: ఎస్పీ

image

ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు ఎంతో కీలకమని, ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలని జిల్లా ఎస్పీ దామోదర్ సూచించారు. 15వ జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా శనివారం జిల్లా పోలీసు గ్రౌండ్‌లో ఎస్పీ “ఓటర్స్ డే” ప్రతిజ్ఞ చేయించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. దేశంలో 1950 జనవరి 25న ఎన్నికల కమిషన్‌ను ఏర్పాటు చేసిన సందర్భంగా నేషనల్ ఓటర్స్ డేను నిర్వహిస్తున్నమన్నారు.

News January 25, 2025

ఒంగోలు: గణతంత్ర వేడుకల ఏర్పాట్ల పరిశీలన

image

76వ గణతంత్ర వేడుకలు నిర్వహించేందుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ తమీమ్ అన్సారియా జిల్లా అధికారులను ఆదేశించారు. కార్యక్రమం నిర్వహించే పోలీసు పరేడ్ గ్రౌండ్‌ను శుక్రవారం ఆమె తనిఖీ చేశారు. SP దామోదర్, జాయింట్ కలెక్టర్ ఆర్. గోపాలకృష్ణలతో కలిసి పరిశీలించారు. ఈ వేడుకలలో పాల్గొనేందుకు, వీక్షించేందుకు వచ్చేవారి హోదాను, సంఖ్యను దృష్టిలో పెట్టుకుని ఏర్పాట్లు చేయాలని అధికారులకు సూచించారు.