News December 20, 2024
ప్రకాశం: ముచ్చటైన ముగ్గులకు ఆహ్వానం!

ధనుర్మాసం ప్రారంభమైంది. విష్ణుమూర్తికి ఎంతో ప్రీతికరమైన ఈ మాసంలో మహిళలు ఉదయాన్నే ఇంటి వాకిటను శుభ్రం చేసి ముగ్గులు వేస్తారు. న్యూ ఇయర్, సంక్రాంతి వరకు రంగురంగుల రంగవళ్లులను తీర్చిదిద్దుతుంటారు. మరి మీ అందమైన ముగ్గులను మాకు పంపండి. మీ పేరుతో Way2Newsలో మేము పబ్లిష్ చేస్తాం.
● ఇలా పంపండి: ముగ్గు ఫొటో, మీ పేరు, ఊరి పేరు, పాస్పోర్టు సైజు ఫొటోను 97036 22022కు వాట్సాప్ చేయండి.
Similar News
News December 13, 2025
ప్రకాశం: చర్చి పాస్టర్లకు కీలక సూచన

ప్రకాశం జిల్లాలోని పాస్టర్లకు జిల్లా మైనార్టీల సంక్షేమ శాఖ అధికారి పార్థసారథి కీలక సూచన చేశారు. ప్రభుత్వం నుంచి గౌరవ వేతనం పొందుతున్న పాస్టర్లు.. వారి చర్చి పేరు మీద ఉన్న బ్యాంకు ఖాతాల పాస్ పుస్తకం జిరాక్స్ కాపీలను గవర్నమెంట్ పోర్టల్లో నమోదు చేసుకోవాలన్నారు. ఆ పత్రాలను ఎంపీడీవో, కమిషనర్ కార్యాలయాల్లో లేదా ఒంగోలులోని జిల్లా మైనార్టీ కార్యాలయంలో అందజేయాలని కోరారు.
News December 13, 2025
ఒంగోలు: నేడు నవోదయ ఎంట్రన్స్ పరీక్ష!

నవోదయలో ఆరో తరగతి ప్రవేశాలకు సంబంధించి శనివారం ఎంట్రెన్స్ టెస్ట్ నిర్వహించనున్నారు. ప్రకాశం జిల్లాలో 5,502 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారు. మొత్తం 25 కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు ఒంగోలు జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ శివరాం తెలిపారు. ఇప్పటికే పరీక్ష నిర్వహణకు పకడ్బందీగా ఏర్పాట్లు చేశామన్నారు. గంట ముందు విద్యార్థులు పరీక్షా కేంద్రానికి చేరుకోవాలన్నారు.