News August 28, 2024

ప్రకాశం: ‘యువతిపై 6 నెలలుగా అత్యాచారం’

image

ప్రకాశం జిల్లా ముండ్లమూరు మండలంలోని మారెళ్ళకు చెందిన మైనర్ బాలికను, అదే పంచాయతీ పరిధిలోని గంగన్నపాలెంకి చెందిన శ్రీరామ్ 6 నెలలుగా అత్యాచారం చేస్తూ చివరికి గర్భవతిని చేసినట్లు బాధితురాలి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయంపై మంగళవారం సాయంత్రం పోక్సో కేసు నమోదయినట్లు SI నాగరాజు తెలిపారు. బాలికను వైద్య పరీక్షల నిమిత్తం ఒంగోలు రిమ్స్‌కు తరలించామని SI అన్నారు.

Similar News

News July 8, 2025

ప్రకాశం: అద్దెకు ఇళ్లు.. చివరికి బెదిరింపులు

image

తన ఇంట్లో అద్దెకు ఉంటూ అద్దె చెల్లించకపోగా ఇంటి యజమానిని బెదిరిస్తున్న వైనంపై సదరు బాధితురాలు సోమవారం SP దామోదర్‌కు ఫిర్యాదు చేశారు. సంతనూతలపాడు మండలం మంగమూరుకు చెందిన ఓ మహిళకు ఒంగోలులో నివాసం ఉంది. ఆ నివాసాన్ని అద్దెకు ఇచ్చారు. వారు అద్దె డబ్బులు చెల్లించకుండా, ఖాళీ చేయకుండా తనను బెదిరిస్తున్నట్లు సదరు యజమాని ఫిర్యాదులో పేర్కొన్నారు.

News July 8, 2025

ఒంగోలు: ‘త్వరగా ఫిర్యాదులు పరిష్కరించాలి’

image

ఒంగోలులోని జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన మీకోసం కార్యక్రమానికి 79 ఫిర్యాదులు అందినట్లు జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రకటించింది. ఈ కార్యక్రమంలో ఎస్పీ దామోదర్ పాల్గొని ఫిర్యాదుదారుల సమస్యలను, ఫిర్యాదులను వివరంగా అడిగి తెలుసుకున్నారు. అనంతరం వెంటనే సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి ఫిర్యాదులను పరిష్కరించాలని ఎస్పీ ఆదేశించారు.

News July 7, 2025

ప్రకాశం: కార్లు అప్పగించలేదంటూ SPకి ఫిర్యాదు.!

image

మూడు కార్లను బాడుగకు తీసుకొని 7 నెలలుగా బాడుగ డబ్బులు చెల్లించడం లేదని ఓ వ్యక్తి సోమవారం ఎస్పీకి ఫిర్యాదు చేశారు. ఒంగోలు మారుతి నగర్‌కు చెందిన ఓ వ్యక్తి మూడు కార్లను బాడుగకు మరో వ్యక్తికి అప్పగించాడు. 7 నెలలు పూర్తైనా ఇప్పటివరకు బాడుగ చెల్లించలేదు. అంతేకాకుండా కార్లను అప్పగించకపోవడంతో బాధితుడు, జిల్లా ఎస్పీ దామోదర్‌ను ఆశ్రయించారు. విచారణ చేయాలని ఎస్పీ ఆదేశించారు.