News October 17, 2024

ప్రకాశం రీజినల్ కో ఆర్డినేటర్‌గా పెద్దిరెడ్డి

image

ఉమ్మడి ప్రకాశం, గుంటూరు జిల్లాల రీజినల్ కో-ఆర్డినేటర్గా ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి నియమితులయ్యారు. వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు వైసీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. గతంలో బాలినేని శ్రీనివాసరెడ్డి ఈ స్థానంలో ఉండగా ఆయన వైసీపీకి రాజీనామా చేసి జనసేనలో చేరిన విషయం తెలిసిందే.

Similar News

News October 19, 2025

ప్రకాశం జిల్లాకు భారీ వర్ష సూచన

image

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటించింది. కాగా.. శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలో కురిశాయి. ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News October 19, 2025

ప్రకాశంకు భారీ వర్ష సూచన

image

ఆగ్నేయ బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, దీని ప్రభావంతో జిల్లాలో ఆదివారం మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని ఏపీ ప్రకృతి విపత్తుల నిర్వహణ సంస్థ శనివారం ప్రకటించింది. కాగా శనివారం సాయంత్రం మోస్తరు నుంచి భారీ వర్షాలు జిల్లాలో కురిశాయి. ఆదివారం పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని, ప్రజలు జాగ్రత్త వహించాలని అధికారులు సూచించారు.

News October 18, 2025

ప్రకాశం జిల్లాలో పోలీసుల దాడులు

image

జిల్లాలో అనుమతి లేకుండా బాణాసంచా విక్రయ కేంద్రాలను నిర్వహిస్తున్న వారిపై శనివారం ఎస్పీ హర్షవర్ధన్ రాజు అధ్వర్యంలో పోలీసులు దాడులు నిర్వహించారు. కనిగిరి–1, మద్దిపాడు–1, పామూరు–2, వెలిగండ్ల–1, మార్కాపురం టౌన్–1 పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదు చేసి రూ.1,38,944 విలువ గల బాణాసంచాలు సీజ్ చేసినట్లు ఎస్పీ కార్యాలయం ప్రకటన విడుదల చేసింది. అనుమతి లేకుండా టపాసులు విక్రయిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.