News March 13, 2025

ప్రకాశం: రూ.40లక్షల ఉద్యోగం.. అయినా సూసైడ్

image

గిద్దలూరులో హైటెన్షన్ కరెంట్ వైర్‌ పట్టుకున్న విద్యార్థి చనిపోయాడు. కంభం(M) రావిపాడుకు చెందిన అమరనాథ్(22) బీటెక్ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. రూ.40 లక్షల జీతంతో జాబ్‌కు సెలెక్టయ్యాడు. HYDలో అన్నను చూసొస్తానని చెప్పి వెళ్లాడు. అన్నను కలవకుండానే ఫ్రెండ్‌తో కలిసి నిన్న గిద్దలూరు వచ్చాడు. ఫ్రెండ్‌ని వాటర్ బాటిల్‌కి పంపి అతను గూడ్స్ రైలెక్కి వైర్లు పట్టుకున్నాడు. కర్నూలులో చికిత్స పొందుతూ చనిపోయాడు.

Similar News

News November 27, 2025

ప్రకాశం: నకిలీ బంగారంతో కేటుగాళ్ల బురిడీ

image

త్రిపురాంతకంలోని ఓ జ్యువెలర్స్ షాప్‌లో ఇద్దరు కేటుగాళ్లు నకిలీ బంగారం పెట్టి యజమానిని బురిడీ కొట్టించారు. 28 గ్రాముల నకిలీ బంగారాన్ని తనఖా పెట్టి రూ.1.50లక్షలను తీసుకుని అక్కడి నుంచి ఉడాయించారు. తాను మోసపోయినట్లు గ్రహించిన షాపు యజమాని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసిన పోలీసులు సీసీ టీవీ ఫుటేజ్ ఆధారంగా నిందితుల కోసం గాలింపు చర్యటు చేపట్టారు.

News November 26, 2025

29న ఒంగోలులో విభిన్న ప్రతిభావంతులకు క్రీడా పోటీలు

image

ఒంగోలులోని డీఆర్ఆర్ఎం హై స్కూల్లో ఈనెల 29న అంతర్జాతీయ విభిన్న ప్రతిభావంతుల దినోత్సవ వేడుకల సందర్భంగా దివ్యాంగుల కోసం ప్రత్యేక క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు విభిన్న ప్రతిభావంతుల సహాయ సంచాలకులు సువార్త తెలిపారు. ఒంగోలులోని తన కార్యాలయంలో బుధవారం ఆమె మాట్లాడారు. విభిన్న ప్రతిభావంతులను క్రీడా పోటీలలో సైతం ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులు పాల్గొనాలని కోరారు.