News December 7, 2024
ప్రకాశం: రెవెన్యూ సదస్సులో 640 అర్జీలు
జిల్లా వ్యాప్తంగా తొలిరోజు శుక్రవారం నిర్వహించిన “రెవెన్యూ సదస్సు”లలో 640 అర్జీలు వచ్చాయని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. వీటిలో ఒంగోలు డివిజన్‌లో 273, కనిగిరిలో 230, మార్కాపురంలో 137 వచ్చాయన్నారు. ఈ మొత్తం అర్జీలు 35 రకాల సమస్యలకు సంబంధించినవని ఆమె శుక్రవారం తెలిపారు. మొత్తం అర్జీలలో నాలుగింటిని అప్పటికప్పుడే పరిష్కరించామన్నారు. ప్రజలు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News January 21, 2025
ప్రకాశం జిల్లా బీజీపీ నూతన అధ్యక్షుడిగా శ్రీనివాసరావు
ప్రకాశం జిల్లా బీజేపీ నూతన అధ్యక్షులుగా సెగం శ్రీనివాస్ రావు నియమితులయ్యారు. ఈ మేరకు మంగళవారం ఒంగోలులో అధికారికంగా కమిటీ సభ్యులు ప్రకటన చేశారు. పార్టీ బలోపేతంపై ఫోకస్ చేస్తానని ఆయన పేర్కొన్నారు. తనకు పదవి వచ్చేందుకు సహకరించిన రాష్ట్ర నాయకులకు నూతన కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
News January 21, 2025
ప్రకాశం: నవోదయ ప్రవేశ పరీక్ష హాల్ టికెట్లు విడుదల
ప్రకాశం జిల్లాలోని నవోదయ విద్యాలయం ప్రవేశ పరీక్ష రాసే 9, 11వ తరగతి విద్యార్థులు హాల్ టికెట్లు తీసుకోవాలని DEO కిరణ్ కుమార్ సోమవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. 9వ తరగతి ప్రవేశానికి 2456 మంది, ఇంటర్ (11) వ తరగతి ప్రవేశానికి 3225 మంది విద్యార్థులు దరఖాస్తులు చేసుకున్నారని తెలిపారు. హాల్ టికెట్లు https://cbseitms.nic.in/2024/nvsix/AdminCard/AdminCard25 వెబ్ సైట్‌లో పొందవచ్చని తెలిపారు.
News January 21, 2025
ప్రకాశం: ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు కొత్త మెనూ
ప్రకాశం జిల్లా ప్రభుత్వ పాఠశాల విద్యార్థులకు మధ్యాహ్న భోజనం మెనూను ప్రభుత్వం సవరించింది. సోమవారం ప్రకటించిన మెనూ వివరాలివి.
➤సోమవారం:తెల్ల అన్నం, సాంబారు, చిక్కీ, ఎగ్ ఫ్రై.
➤మంగళవారం: పులిహోర, పుదీనా చట్నీ, ఎగ్, రాగిజావ.
➤బుధవారం తెల్ల అన్నం, కూర, ఎగ్, చిక్కీ.
➤గురువారం: పలావు, గుడ్డు, రాగిజావ.
➤శుక్రవారం: తెల్ల అన్నం, కోడి గుడ్లకూర.
➤శనివారం: అన్నం, టమోటా పప్పు/ పప్పుచారు, తీపి పొంగల్, రాగిజావ.