News February 9, 2025

ప్రకాశం: రేపటినుంచి పదవ తరగతి ప్రీ ఫైనల్ పరీక్షలు

image

ప్రకాశం జిల్లాలో పదవ తరగతి విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు సోమవారం నుంచి 20వ తేదీ వరకు ప్రీ ఫైనల్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు డీఈవో కిరణ్ కుమార్ తెలిపారు. ప్రతిరోజు ఉదయం 09:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు పరీక్ష నిర్వహిస్తున్నామని తెలిపారు. జిల్లాలోని అన్ని యాజమాన్య పాఠశాలల్లో పరీక్షలను నిర్వహించాలని తెలిపారు.

Similar News

News July 9, 2025

ప్రకాశం జిల్లాలోని ఈ పాఠశాల్లో ఒక్కరు కూడా చేరలేదు.!

image

అత్యధికంగా HMపాడులో 10, కొమరులులో 8, CS పురంలో, కనిగిరి, రాచర్ల మండలాల్లో 5 స్కూళ్లల్లో అడ్మిషన్లు నమోదు కాలేదు. బీపేట, దర్శి, దొనకొండ, మద్దిపాడు, నాగులుప్పలపాడు, పొదిలి, సింగరాయకొండ, త్రిపురాంతంకంలో ఒక్కో స్కూల్లో ఎవరూ చేరలేదు. ఒంగోలు, టంగుటూరు మండలాల్లో 3, చీమకుర్తి, కొండపి, కురిచేడులో రెండేసి సూళ్లల్లో అడ్మిషన్లు లేవు.

News July 9, 2025

ఒంగోలు: 17 నెలల చిన్నారికి నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్‌

image

ఒంగోలులోని సత్యనారాయపురానికి చెందిన చిన్నారి అంబటి ఖశ్విని ఎస్పీ దామోదర్ మంగళవారం ప్రత్యేకంగా అభినందించారు. 17 నెలల వయస్సులోనే ఖశ్వి 24 వేర్వేరు కేటగిరీల్లో 650కి పైగా ఇంగ్లిష్ పదాలను మాట్లాడడంతో నోబెల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్‌లో స్థానం దక్కించుకుంది. దీంతో చిన్న వయస్సులోనే అద్భుత రికార్డ్ సృష్టించిన చిన్నారిని, తల్లిదండ్రులను ప్రశంసించారు.

News July 9, 2025

బీఎల్ఓల భాద్యతే కీలకం: ఇన్‌ఛార్జి కలెక్టర్

image

పారదర్శకమైన ఓటరు జాబితాను రూపొందించడంలో బీఎల్ఓల భాద్యతలు కీలకమని ఇన్ఛార్జి కలెక్టర్ గోపాలకృష్ణ తెలిపారు. ఒంగోలులోని ఎన్టీఆర్ కళాక్షేత్రంలో మంగళవారం బీఎల్ఓల శిక్షణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. కేంద్ర ఎన్నికల సంఘం జారీచేసిన మార్గదర్శకాలపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా భాద్యతలు నిర్వర్తించాలన్నారు.