News May 19, 2024
ప్రకాశం: రైలు పట్టాలపై మృతదేహం
జిల్లాలోని సింగరాయకొండ మండలం ఊళ్ళ పాలెం గ్రామ సమీపాన గల రైల్వే వంతెన వద్ద గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు ఆదివారం గుర్తించారు. రైలు పట్టాల మధ్య సదరు వ్యక్తి పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. వారు మృతుడి వివరాలను ఆరా తీస్తున్నట్లు సమాచారం. రైలు కిందపడి ఆ వ్యక్తి మృతి చెంది ఉండవచ్చని స్థానికులు భావిస్తున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News December 9, 2024
పర్చూరు వద్ద ఒకే రోజు నలుగురు మృతి
పర్చూరు మండలం అన్నంబట్లవారిపాలెం సమీపంలో బైక్‌పై బీచ్‌కు వెళ్లి వస్తున్న <<14826140>>ముగ్గురిని ఆదివారం ఓ లారీ ఢీకొంది.<<>> ఈ ప్రమాదంలో అత్తా, అల్లుడు అక్కడికక్కడే మృతి చెందగా.. కుమార్తె చికిత్స పొందుతూ చనిపోయింది. అదే ప్రాంతంలో తూమాటి సుబ్బయ్య(74) అనే వ్యక్తి <<14827146>>సైకిల్‌పై వెళ్తుండగా లారీ ఢీకొని మృతి<<>> చెందాడు. ఇలా ఒకే రోజు మండలంలో నలుగురు మృతి చెందడంతో ఆ ప్రాంతంలో తీవ్ర విషాద ఛాయలు అలముకున్నాయి.
News December 7, 2024
ధర్మవరపు సుబ్రహ్మణ్యం అద్దంకి నియోజకవర్గానికి చెందిన వారే
తన నటనతో తెలుగు ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన ప్రముఖ హాస్య నటుడు ధర్మవరపు సుబ్రహ్మణ్యం ఉమ్మడి ప్రకాశం జిల్లాకు చెందిన వ్యక్తి. నేడు ఆయన వర్ధంతి. బల్లికురవ మండలం, కొమ్మినేనివారిపాలెంలో 1954లో జన్మించిన ఆయన అనారోగ్య కారణంగా 2013, డిసెంబర్ 7న మరణించారు. ఆయన ప్రాథమిక విద్యను తన స్వగ్రామంలో, 6 నుంచి 10వ తరగతి వరకు అద్దంకిలో చదివారు. ఒంగోలు CSR శర్మ కాలేజీలో ఇంటర్ విద్యను అభ్యసించారు.
News December 7, 2024
ప్రకాశం: రెవెన్యూ సదస్సులో 640 అర్జీలు
జిల్లా వ్యాప్తంగా తొలిరోజు శుక్రవారం నిర్వహించిన “రెవెన్యూ సదస్సు”లలో 640 అర్జీలు వచ్చాయని జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. వీటిలో ఒంగోలు డివిజన్‌లో 273, కనిగిరిలో 230, మార్కాపురంలో 137 వచ్చాయన్నారు. ఈ మొత్తం అర్జీలు 35 రకాల సమస్యలకు సంబంధించినవని ఆమె శుక్రవారం తెలిపారు. మొత్తం అర్జీలలో నాలుగింటిని అప్పటికప్పుడే పరిష్కరించామన్నారు. ప్రజలు రెవెన్యూ సదస్సులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.