News June 2, 2024
ప్రకాశం: రోడ్డు దాటుతుండగా లారీ ఢీ.. స్పాట్ డెడ్

బల్లికురవ మండలంలోని కొప్పెరపాడు వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొప్పెరపాడు గ్రామానికి చెందిన పిచ్చయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 16, 2025
ప్రకాశం: ప్రభుత్వ కళాశాలలో వికృతి చేష్టలు.. ఐదుగురిపై వేటు

ప్రకాశం జిల్లా కొమరోలులోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో అధ్యాపకులు వికృత చేష్టలు చేస్తున్నట్లు విద్యార్థులు అధికారులకు లేఖల రూపంలో ఫిర్యాదు చేశారు. గుంటూరు ఆర్జేడీ పద్మజ సోమవారం కళాశాలలో విచారణ చేపట్టి నలుగురు అధ్యాపకులను తాత్కాలికంగా విధుల నుంచి తొలగిస్తున్నామన్నారు. బోధనేతర సిబ్బందిని డిప్యూటేషన్పై వేరే కళాశాలకు పంపించామని తెలిపారు.
News September 16, 2025
కలెక్టర్ల సమావేశంలో పాల్గొన్న ప్రకాశం కలెక్టర్

తాడేపల్లిలోని రాష్ట్ర సచివాలయంలో సీఎం చంద్రబాబు సోమవారం కలెక్టర్ల సమావేశం నిర్వహించిన విషయం తెలిసిందే. రెండు రోజులపాటు జరిగే ఈ సమావేశానికి సోమవారం ప్రకాశం జిల్లా కలెక్టర్ రాజాబాబు సైతం హాజరయ్యారు. జిల్లా కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం సీఎంతో సమావేశంలో పాల్గొనేందుకు కలెక్టర్ తాడేపల్లికి వెళ్లారు. ఈ దశలోనే కలెక్టర్ల సమావేశంలో పాల్గొని పలు అభివృద్ధి కార్యక్రమాలపై మాట్లాడారు.
News September 15, 2025
ప్రకాశం ఎస్పీ మీకోసంకు 58 ఫిర్యాదులు

ఒంగోలులోని ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ఎస్పీ మీకోసం కార్యక్రమానికి 58 ఫిర్యాదులు అందినట్లు ఎస్పీ కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. జిల్లా ఎస్పీ హర్షవర్ధన్ రాజు ఆదేశాల మేరకు పోలీస్ ఉన్నతాధికారులు, మీకోసం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మీకోసంకు వచ్చిన ఫిర్యాదుదారుల సమస్యలను పోలీసులు అడిగి తెలుసుకున్నారు.