News June 2, 2024
ప్రకాశం: రోడ్డు దాటుతుండగా లారీ ఢీ.. స్పాట్ డెడ్
బల్లికురవ మండలంలోని కొప్పెరపాడు వద్ద ఆదివారం ఉదయం రోడ్డు ప్రమాదం జరిగింది. రోడ్డు దాటుతున్న వ్యక్తిని లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కొప్పెరపాడు గ్రామానికి చెందిన పిచ్చయ్య అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న బల్లికురవ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
Similar News
News September 14, 2024
బాపట్ల జిల్లాలో తీవ్ర విషాదం
బాపట్ల జిల్లా యద్దనపూడి మండల పరిధిలోని పూనూరు గ్రామంలో హృదయ విధారక ఘటన చోటుచేసుకుంది. స్థానికుల వివరాల ప్రకారం.. పూనూరు గ్రామానికి చెందిన తండ్రీ, కొడుకులు ఆత్మహత్యకు పాల్పడ్డిన ఘటన శనివారం వెలుగులోకి వచ్చింది. ఒకేసారి తండ్రీ, కొడుకులు తనువు చాలించడంతో ఆ గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News September 14, 2024
తిరుపతిలో ప్రకాశం జిల్లా విద్యార్థిపై కత్తితో దాడి
ప్రకాశం జిల్లా గిద్దలూరుకు చెందిన విద్యార్థి లోకేశ్ తిరుపతి MBU యూనివర్షిటీలో చదువుతున్నాడు. అయితే శనివారం అతను ఓ థియేటర్‌లో సినిమాకు వెళ్లగా.. లోకేశ్ పై కార్తీక్ అనే యువకుడు కత్తితో దాడి చేశాడు. దాడి అనంతరం కార్తీక్‌తోపాటు మరో యువతి కావ్య పరారయ్యారని పోలీసులు తెలిపారు. అయితే ఈ దాడికి ప్రేమ వ్యవహారమే కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. కార్తీక్, కావ్యది సూళ్లూరుపేటగా గుర్తించారు.
News September 14, 2024
కొండపిలో కిలో పొగాకు ధర రూ.358
కొండపి పొగాకు వేలం కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన వేలానికి జువ్విగుంట, అయ్యవారిపాలెం, తంగేళ్ల, జాళ్లపాలెం, పీరాపురం గ్రామాలకు చెందిన రైతులు 1354 బేళ్లను వేలానికి తీసుకొని వచ్చారు. అందులో 1009 బేళ్లను కొనుగోలు చేశారు. వ్యాపారులు వివిధ కారణాలతో 345 బేళ్లను తిరస్కరించారు. పొగాకు గరిష్ఠ ధర కేజీ రూ.358, కనిష్ఠ ధర కేజీ రూ.180, సరాసరి ధర రూ.266.88 పలికింది.