News October 2, 2024

ప్రకాశం వస్తున్నారా.. అయితే ఇవి చూసేయండి.!

image

దసరా సెలవుల నేపథ్యంలో ప్రకాశం జిల్లాకు వస్తున్నారా.. అయితే ఈ పర్యాటక ప్రదేశాలను మిస్ కావద్దు. జిల్లాలో భైరవకోన, కొత్తపట్నం, రామాయపట్నం, పాకల బీచ్‌లు, వల్లూరమ్మ తల్లి ఆలయం, కంభం చెరువు, మాలకొండ స్వామి ఆలయం, మిట్టపాలెం నారాయణస్వామి ఆలయం, గుండ్లకమ్మ ప్రాజెక్టు ఇలా ఎన్నో ప్రముఖ క్షేత్రాలు, పర్యాటక ప్రాంతాలు జిల్లాలో ఉన్నాయి. దసరా సెలవులు అనగానే మీకు గుర్తొచ్చే చిన్ననాటి జ్ఞాపకాలు కామెంట్ చేయండి.

Similar News

News November 1, 2025

నష్టపోయిన రైతులందరినీ ఆదుకుంటాం: కలెక్టర్

image

తుఫాన్ వలన నష్టపోయిన రైతులందరిని ఆదుకుంటామని కలెక్టర్ రాజబాబు హామీ ఇచ్చారు. మార్కాపురం సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఎమ్మెల్యేతో కలిసి మాట్లాడారు. రికార్డు స్థాయిలో తుఫాన్ వల్ల 20 సెంటీమీటర్ల వర్షం నమోదయిందన్నారు. ఫలితంగా వాగులు, వంకల ప్రవాహం పెరగడంతో పంట పొలాలు, రోడ్లు దెబ్బతిన్నట్లు తెలిపారు. పరిస్థితిని స్వయంగా పరిశీలించేందుకు క్షేత్రస్థాయిలో పర్యటించినట్లు వివరించారు.

News November 1, 2025

ప్రకాశం ప్రజలకు ఎస్పీ కీలక సూచనలు..!

image

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలో జరిగిన విషాద ఘటన నేపథ్యంలో జిల్లాలోని భక్తులకు ఎస్పీ హర్షవర్ధన్ రాజు శనివారం
పలు కీలక సూచనలు చేశారు. ప్రస్తుతం కార్తీకమాసం సందర్భంగా తీర ప్రాంతాలు, శివాలయాలలో భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహిస్తుంటారన్నారు. ఈ కర్రమంలో తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. దీపాలు వెలిగించే సమయంలో భక్తితో పాటు జాగ్రత్త వహించాలన్నారు. తీర ప్రాంతాలలో మన అప్రమత్తతే మనకు రక్ష అన్నారు.

News November 1, 2025

దేవుడు సొమ్ము సైతం గోల్‌మాల్..?

image

నాగులుప్పలపాడు (M) మట్టిగుంట శివాలయ వ్యవసాయ భూమి 41.5 సెంట్ల ద్వారా వచ్చే ఆదాయంలో సుమారు రూ.70 లక్షలు గల్లంతైనట్లు గ్రామస్థులు ఆరోపించారు. ఏటా రూ.10 లక్షలకు పైగా కౌలు ఆదాయం వస్తున్నా 6 నెలలుగా అర్చకులకు జీతాలు ఇవ్వడం లేదన్నారు. శుక్రవారం నిర్వహించిన సమావేశంలో రికార్డులు చూపించడంలో ప్రస్తుత EO విఫలమైనట్లు పలువురు ఆరోపించారు. రికార్డుల నిర్వహణ లోపం వల్ల ఆదాయానికి గండి పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.