News March 21, 2024
ప్రకాశం: వాలంటీర్లకు హెచ్చరిక
జిల్లాలో ఇటీవల ఎన్నికల కోడు అమలులోకి వచ్చింది. దీంతో ప్రచారాలు చేసుకోవాలన్నా, పోస్టర్లు వేసుకోవాలంటే అనుమతులు తప్పనిసరని కలెక్టర్ దినేశ్ కుమార్ రాజకీయ పార్టీ నాయకులకు తెలిపారు. ఇందులో ముఖ్యంగా వాలంటీర్లు రాజకీయ పార్టీల ప్రచారంలో పాల్గొన్న, పార్టీ కండువాలు వేసుకున్నా, ఓటర్లను ప్రలోభాలకు గురి చేసినా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇప్పటికే జిల్లాలో కొంతమంది వాలంటీర్లను విధుల నుంచి తొలగించారు.
Similar News
News September 17, 2024
ప్రకాశం: ఇవాళ్టి నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు
జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ వరకూ స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ జరపనున్నట్లు తెలిపారు. స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత నినాదంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు.
News September 16, 2024
స్టేట్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌గా ఏల్చూరు మహిళ
ఈ నెల 14, 15వ తేదీలలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన 11వ ఏపీ అన్ ఎక్యూపుడ్ పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పవర్ లిఫ్టింగ్ పోటీలలో సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన కుమారి నంద పాల్గొని 2 పతకాలు సాధించారు. ఈమెను పలువురు అభినందించారు.
News September 16, 2024
ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు
ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. జిల్లాలోని 13 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ దామోదర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని ఎస్పీ దామోదర్ చెప్పారు. డిస్ట్రిక్ట్ వీఆర్‌లో ఉన్న కొందరికి వివిధ మండలాల్లో పోస్టింగ్లు ఇవ్వగా, మరికొందరిని వీఆర్‌కు బదిలీ చేశారు.