News January 10, 2025
ప్రకాశం: విద్యార్థినులపై లైంగిక వేధింపులు

తమను ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ వేధిస్తున్నాడని విద్యార్థినులను పోలీసులకు ఫిర్యాదు చేశారు. ప్రకాశం జిల్లా మద్దిపాడు మండలం వెంకటరాజుపాలెం పరిధిలో ఓ ప్రైవేట్ ఫార్మసీ కాలేజీ ఉంది. అందులో పనిచేసే ఇన్ఛార్జ్ ప్రిన్సిపల్ తమను వేధిస్తున్నాడని విద్యార్థినులు వాపోయారు. గదిలోకి తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తిస్తున్నాడని ఆరోపించారు. తనకు సహకరించకపోతే మార్కులు తక్కువ వేస్తానంటూ తమను బెదిరిస్తున్నారన్నారు.
Similar News
News December 13, 2025
ప్రకాశం: అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల జాబితా విడుదల

ప్రకాశం జిల్లాలో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లగా ఎంపికైన 117 మందితో జాబితా విడుదల చేశామని డీఈవో రేణుక తెలిపారు. www.prakasamschooledu.com ద్వారా జాబితా చెక్ చేసుకోవాలని సూచించారు. ఈనెల 15వ తేదీలోగా కేటాయించిన పాఠశాలల్లో జాయిన్ కావాలని ఆదేశించారు. సంబంధిత హెచ్ఎంలు ప్రతి నెలా 2వ తేదీన డ్యూటీ సర్టిఫికేట్ సమగ్ర శిక్ష కార్యాలయంలో అందజేయాలన్నారు.
News December 13, 2025
ప్రకాశం జిల్లాలో 5.26 లక్షల సంతకాల సేకరణ

మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా సేకరించిన సంతకాల పత్రాలను వైసీపీ రాష్ట్ర కార్యాలయానికి సోమవారం తరలిస్తామని దర్శి MLA బూచేపల్లి శివప్రసాద్ రెడ్డి చెప్పారు. ఒంగోలులోని వైసీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. కాలేజీల ప్రైవేటీకరణకు నిరసనగా జిల్లాలో 5.26 లక్షల మంది సంతకాలు చేశారని చెప్పారు. వాటిని ప్రత్యేక వాహనం ద్వారా వైసీపీ ఆఫీసుకు తరలిస్తామన్నారు.
News December 13, 2025
ప్రకాశం: గ్యాస్ ఏజెన్సీలకు నోటీసులు

ప్రకాశం జిల్లాలోని 24 గ్యాస్ ఏజెన్సీలకు జేసీ గోపాలకృష్ణ షోకాజ్ నోటీసులు జారీ చేశారు. గ్యాస్ డెలివరీ సమయంలో అధిక డబ్బులు వసూలు చేస్తున్నట్లు ఐవీఆర్ఎస్ సర్వే ద్వారా తేలింది. ఇకపై డెలివరీ బాయ్ ప్రవర్తన, రసీదుకు మించి డబ్బులు ఎక్కువగా వసూలు చేసినా ఉపేక్షించేది లేదని జేసీ హెచ్చరించారు. మీ ఏరియాలో సిలిండర్ డెలివరీకి ఎక్కువ నగదు తీసుకుంటే ఊరిపేరు, ఏజెన్సీ పేరుతో కామెంట్ చేయండి.


