News August 12, 2024
ప్రకాశం విద్యార్థులు మృతి చెందారనడానికి కారణమిదే.!
తమిళనాడులోని తిరువళ్లూర్ జిల్లాలో ఆదివారం రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో APలోని పలు జిల్లాలకు చెందిన ఐదుగురు మృతి చెందగా మరో ఇద్దరికి గాయాలయ్యాయి. <<13831591>>ప్రకాశం జిల్లాకు చెందిన ఐదుగురు మృతి<<>> చెందినట్లుగా ప్రచారం జరిగింది. కారణం మృతుల్లో ప్రొద్దుటూరుకు చెందిన నితిశ్ ఇంటిపేరు గిద్దలూరు కావడం, గాయపడిన చైతన్యది పొదిలని తెలియడంతో ఐదుగురు ప్రకాశం వాసులు మృతి చెందినట్లు ప్రచారం జరిగింది.
Similar News
News September 17, 2024
ప్రకాశం: ఇవాళ్టి నుంచి స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమాలు
జిల్లాలో ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ వరకూ స్వచ్చతా హీ సేవా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ తమీమ్ అన్సారియా తెలిపారు. అక్టోబర్ 2న స్వచ్ఛ భారత్ దివస్ జరపనున్నట్లు తెలిపారు. స్వభావ్ స్వచ్ఛత – సంస్కార్ స్వచ్ఛత నినాదంతో స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమాలపై అవగాహనా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ చెప్పారు.
News September 16, 2024
స్టేట్ పవర్ లిఫ్టింగ్ చాంపియన్‌గా ఏల్చూరు మహిళ
ఈ నెల 14, 15వ తేదీలలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా అమలాపురంలో జరిగిన 11వ ఏపీ అన్ ఎక్యూపుడ్ పవర్ లిఫ్టింగ్, బెంచ్ ప్రెస్ ఛాంపియన్ షిప్ పోటీలను నిర్వహించారు. ఈ పవర్ లిఫ్టింగ్ పోటీలలో సంతమాగులూరు మండలం ఏల్చూరుకు చెందిన కుమారి నంద పాల్గొని 2 పతకాలు సాధించారు. ఈమెను పలువురు అభినందించారు.
News September 16, 2024
ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైల బదిలీలు
ప్రకాశం జిల్లాలో భారీగా ఎస్సైలు బదిలీ అయ్యారు. జిల్లాలోని 13 మంది ఎస్సైలను బదిలీ చేస్తూ ఎస్పీ దామోదర్ సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. తక్షణమే ఇవి అమల్లోకి వస్తాయని ఎస్పీ దామోదర్ చెప్పారు. డిస్ట్రిక్ట్ వీఆర్‌లో ఉన్న కొందరికి వివిధ మండలాల్లో పోస్టింగ్లు ఇవ్వగా, మరికొందరిని వీఆర్‌కు బదిలీ చేశారు.