News October 10, 2024
ప్రకాశం: విధులకు వస్తూ MRO మృతి
ప్రకాశం జిల్లాలో విషాద ఘటన వెలుగు చూసింది. అర్ధవీడు మండల MRO కుక్కమూడి దాసు (54) యర్రగొండపాలెం నుంచి విధులకు బయల్దేరగా మార్గమధ్యలో అస్వస్థతకు గురయ్యారు. మార్కాపురంలో ప్రథమ చికిత్స చేసి పల్నాడు జిల్లా నరసరావుపేటకు తరలిస్తుండగా చనిపోయారు. గుండెపోటుతోనే మరణించినట్లు వైద్యులు నిర్ధారించారు. ఆయన స్వగ్రామం పల్నాడు జిల్లా వెల్దుర్తి మండలం రచ్చమళ్లపాడు గ్రామం.
Similar News
News November 11, 2024
మార్కాపురంలో కానిస్టేబుల్ సూసైడ్
కుటుంబ కలహాల నేపథ్యంలో కానిస్టేబుల్ ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్న ఘటన మార్కాపురం మండలంలో చోటుచేసుకుంది. కొట్టాలపల్లికి చెందిన వేముల మస్తాన్ మార్కాపురం పట్టణ పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నారు. రాత్రి భార్యాభర్తల మధ్య వివాదం తలెత్తినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. దీంతో మనస్తాపానికి గురైన మస్తాన్ తెల్లవారుజామున ఇంట్లో ఆత్మహత్యకు పాల్పడ్డాడు.
News November 11, 2024
నేడు అసెంబ్లీలో ప్రకాశం MLAలు ఏం మాట్లాడతారో.!
నేటి నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు ఉమ్మడి ప్రకాశం జిల్లా ఎమ్మెల్యేలు హాజరు కానున్నారు. ఎన్నికలు జరిగాక తొలి బడ్జెట్ సమావేశం కావడంతో అందరిలోనూ ఆసక్తి నెలకొంది. ఎన్నికలకు ముందు మార్కాపురం జిల్లా ఏర్పాటు, వెలిగొండ ప్రాజెక్ట్ పూర్తి, కందుకూరును ప్రకాశంలో కలపడం వంటి అంశాలపై ప్రస్తుతం ఎన్నికైన MLAలు హామీలు ఇచ్చారు. మరి వీటి అమలు జరిగేలా అసెంబ్లీలో చర్చిస్తారా? లేదా? వేచి చూడాలి. మరి మీ కామెంట్.
News November 11, 2024
కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో పొదిలి విద్యార్థుల ప్రతిభ
జాతీయస్థాయి తొమ్మిదో ఓపెన్ కరాటే ఛాంపియన్ షిప్ పోటీల్లో పొదిలి విద్యార్థులు ప్రతిభ చూపారు. మంగళగిరిలో అదివారం జరిగిన టీం పోటీల్లో పదేళ్ల లోపు బాలికల వ్యక్తిగత కటా విభాగంలో కీర్తిక బంగారు పతకం, పదకొండేళ్ల బాలుర కటావిభాగంలో సాయి ప్రతీక్ కాంస్య పతకం, పదేళ్ల లోపు బాలుర కటావిభాగంలో జయ సాయివిష్ణువర్ధన్ రెడ్డి కాంస్య పతకం సాధించారు. విద్యార్థులతోపాటు శిక్షణ ఇచ్చిన మాస్టర్ వేణును గ్రామస్థులు అభినందించారు.